తెలంగాణలో పేరొందిన చరిత్రాత్మక కట్టడాలు చరిత్రలో కలుస్తున్నాయి. వాటిస్థానంలో ప్రభుత్వాలు పోటీ పడి మరీ కొత్తవి నిర్మిస్తున్నాయి. దశాబ్దాలు, శతాబ్దాల నాటి కట్టడాలు కావడంతో కొంత మేరకు మార్పుల పేరుతో కొత్తవాటికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలోనే గతంలో కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రానికి చెందిన సచివాలయాన్ని పక్కన పెట్టి ఇంద్రభవనం వంటి నూతన సచివాలయాన్ని నిర్మించారు. దీనిపై అనేక విమర్శలు వచ్చినా.. ఆయన ముందుకే వెళ్లారు.
ఇక, ఇప్పుడు రేవంత్ వంతు వచ్చింది. ఈయన ఉస్మానియా ఆసుపత్రి స్థానంలో కొత్తదానిని నిర్మిస్తున్నా రు. హైదరాబాద్‌లోనే పేరెన్నికగన్న ఉస్మానియా ఆసుపత్రి గురించి అందరికీ తెలిసిందే. సువిశాల ప్రాంగణంలో స్వాతంత్య్రానికి పూర్వమే నిర్మించిన ఈ ఆసుపత్రికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు వస్తారు. అయితే.. ఇది పాత నిర్మాణం కావడంతో దానిని పక్కన పెట్టి కొత్తదానికి తాజాగా శంకుస్థాపన చేశారు.
గోషామహల్ మైదానంలో ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దీనిని 2 వేల పడకలతో 26.3 ఎకరాల్లో నిర్మించనున్నారు. దీనికి సంబంధించి 2400 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. మొత్తం 14 అంతస్తుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించనున్నారు. దీనిలో అత్యాధునిక వైద్య సౌకర్యాలను కల్పించనున్నారు. మొత్తం 30 విభాగాల్లో వైద్య సేవలు అందించను న్నారు.
కొత్తగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రిలో రోబోటిక్ సర్జరీలు చేసేలా సౌకర్యాలు ఉండనున్నాయి. అదేవిధంగా కొత్త ఆస్పత్రిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనిని రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం జరిగిన భూమి పూజలో సీఎం రేవంత్ తో పాటు మంత్రి భట్టి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. కాగా.. రేవంత్ రెడ్డి హయాంలో జరిగిన భారీ నిర్మాణానికి జరిగిన తొలి శంకుస్థాపన కావడం గమనార్హం.
This post was last modified on January 31, 2025 2:23 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…