ఓడలు బండ్లు..బండ్లు ఓడలవుతాయనే సామెత ఇటువంటి వాళ్ళని చూస్తే నిజమే అనిపిస్తుంది. సంవత్సరాల తరబడి ఎవరికీ తెలీకుండా తెర వెనుక మాత్రమే ఉన్న వ్యక్తి ఒక్క సారిగా 2014 ఎన్నికల తర్వాత తెరముందుకు వచ్చేశారు. అంతే కాకుండా ఐదేళ్ళపాటు ఓ వెలుగు వెలిగారు. ఆయన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ. నారాయణ ఎప్పుడూ ప్రజా జీవితంలో లేనేలేరు. అలాంటిది ప్రతిపక్షంలో ఉన్నపుడు టీడీపీని ఆదుకున్నాడన్న కారణంగా చంద్రబాబునాయుడు ఈయనకు మంత్రిపదవిని ఇచ్చి రుణం తీర్చుకున్నారు. నారాయణ ఎంఎల్సీ అయి తర్వాత మంత్రయిపోయారు.
అందులోను కీలకమైన రాజధాని అమరావతి, సిఆర్డీఏ కూడా ఆయన చేతిలోనే ఉండేది. మున్సిపల్ శాఖ మంత్రిగా వెలుగు వెలిగారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ఎంఎల్ఏలు, మంత్రులు, నేతలే అసూయపడే స్ధాయిలో నారాయణ స్థానం సంపాదించారు. ఇటువంటి నారాయణతో స్వయంగా తాను ఎన్నికల్లో ఓడిపోవటంతో పాటు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోయేసరికి ఎక్కడా అడ్రస్ కనబడటం లేదట. పార్టీతో పాటు చంద్రబాబుకు కూడా బాగా గ్యాప్ వచ్చేసిందని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడైతే ఘోరంగా ఓడిపోయారో అప్పటి నుండి కేవలం తన విద్యాసంస్ధలకే పరిమితమైపోయారని టాక్. వ్యాపారాలు కీలకం కావడం వల్ల ఆర్ధిక పునాదులకు దెబ్బ తగులుతుందన్న టెన్షన్ బాగా ఎక్కువైపోవడం దీనికి కారణం కావచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయన్న కారణంతో విజయవాడ, తిరుపతి, ఏలూరులో కొన్ని విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేసింది. ఈ నేపధ్యంలోనే తన పనేదో తాను చేసుకుని వెళ్ళిపోవటమే ఉత్తమం అనే పద్దతిలో నారాయణ వ్యవహరిస్తున్నారట.
నెల్లూరులో కానీ విజయవాడ, హైదరాబాద్ లో ఎక్కడా సాధ్యమైనంతలో టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఏదన్నా అవసరమై నెల్లూరుకు వచ్చినా ఎవరినీ కలవకుండానే వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోతున్నారట. మాజీ మంత్రి పరిస్దితే ఇలాగుంటే ఆయన్ను నమ్ముకుని రాజకీయాల్లో ఐదేళ్ళు ప్రత్యర్ధులపై రెచ్చిపోయిన మద్దతుదారుల మాటేమిటి ? అనేది జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది.
ఆ మధ్యలో నారాయణ వైసీపీలో చేరిపోతున్నారంటూ ప్రచారం జరిగినా ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. ఎందుకైనా మంచిదని నారాయణతో పాటు ఆయన వర్గమంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. నారాయణ పరిస్ధితి ఇలాగుంటే ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి, విశాఖనగరంలో ప్రస్తుత ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావు పరిస్ధితి… రాజధాని వివాదం వల్ల మరో రకరమైన డోలయామానంలో ఉంది.
This post was last modified on October 21, 2020 9:14 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…