నిజమేనండోయ్.. ఏపీకి పెట్టుబడుల వరద ఆగట్లేదు. కూటమి సర్కారు పాలన మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.6.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. టీడీపీ అదినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఏపీ దిశగా ఆసక్తిగా చూసిన బడా పారిశ్రామిక సంస్థలు… ఇలా పిలవంగానే అలా వచ్చి వాలిపోతున్నాయి. ఫలితంగా కేవలం 7 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి.
పెట్టుబడులు వస్తున్న వేగానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పరుగు పెట్టాల్సిందే కదా. అందుకే కాబోలు… ఈ 7 నెలల్లోనే ఇప్పటికే రెండు పర్యాయాలు బేటీ అయిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) గురువారం మూడో సారి కూడా భేటీ అయ్యింది. ఈ సందర్భంగా కూడా మరో 15 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోద ముద్ర వేసింది. ఈ భేటీలో ఆమోదం లభించిన 15 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.44,776 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అదే సమయంలో 19,580 ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటుటోకి రానున్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలతో నిత్యం సంప్రదింపులు జరుపుతూ…ఆయా సంస్థలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో వేగంగా చర్యలు చేపట్టాలన్నారు. ఫలితంగా ఆయా కంపెనీల యూనిట్లు రాష్ట్రంలో త్వరితగతిన గ్రౌండ్ అయ్యేలా చూడాలని కూడా ఆయన ఆదేశించారు. ఈ విషయంలో కంపెనీల పట్ల పక్షపాతం సహించేది లేదని హెచ్చరించారు. పెట్టుబడుల ఆకర్షణలో ఇదే స్పీడును కొనసాగిస్తే… అతి త్వరలోనే రాష్ట్రం ఏ ఒక్కరూ ఊహించనంత మేర వృద్ధి సాధిస్తుందని ఆయన చెప్పారు.
This post was last modified on January 30, 2025 6:59 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…