తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుల కోసం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన తన గురువు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో కలిసి ఆయన దాదాపుగా 3 రోజుల పాటు సాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నోట నుంచి పదే పదే వినిపించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై ఆయనకూ మక్కువ ఏర్పడినట్టుంది. దావోస్ సదస్సు ముగించుకుని తిరిగి రాగానే… ఏఐ వినియోగంపై ఆయన ఒకింత లోతుగానే దృష్టి పెట్టినట్టు ఉన్నారు. అందుకే కాబోలు తెలంగాణ సర్కారు నుంచి గురువారం ఏఐ వినియోగం దిశగా ఓ కీలక ప్రకటన వెలువడింది.
తెలంగాణలోని పాఠశాల విద్యలో ఏఐని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా పాఠశాల విద్యను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్టుగా కూడా కీలక ప్రకటన చేసింది.ఇందుకోసం బెంగళూరుకు చెందిన ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. అందులో భాగంగా తొలుత ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో ఏఐ ఆధారిత బోధనను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా సదరు ప్రకటన వెల్లడించింది. అందుకోసం అవసరమైన చర్యలను ప్రారంబించినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది.
దావోస్ నుంచి తిరిగి వచ్చినంతనే… అక్కడ తనకు ఎదురైన అనుభవాలను అధికారులు, సహచర మంత్రులతో పంచుకున్న రేవంత్ రెడ్డి… భవిష్యత్తు అంతా ఏఐదేనని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారట. అందివస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు సాగితేనే రేసులో ఉంటామన్న విషయాన్ని ఆయన చెప్పారట. ఈ క్రమంలో ఏఐ వినియోగాన్ని ప్రవేశపెట్టే రంగాలను గుర్తించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మరోమారు సీఎంతో భేటీ అయి పాఠశాల విద్యలో ఏఐ వినియోగంతో అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు. వారి ప్రజెంటేషన్ విన్న రేవంత్ ఆ దిశగా ముందుకు వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. సీఎం ఓకే చెప్పినంతనే బెంగళూరు వెళ్లిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అక్కడ ఏక్ స్టెప్ ఫౌండేషన్ ప్రతినిధులతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారట.
This post was last modified on January 30, 2025 6:35 pm
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…