Political News

కూటమి ఘన విజయం!… ‘ఉక్కు’కు లేదిక ముప్పు!

ఏపీలో గురువారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ముప్పు నుంచి బయటపడిపోయింది. భవిష్యత్తుల్లో ఇక విశాఖ ఉక్కుకు ప్రైవేటీకరణ అన్న మాటే వినిపించని రీతిలో వరుస ప్రకటనలు వెలువడ్డాయి. అంతేకాకుండా సంస్థను లాభాల బాట పట్టించేందుకు పకడ్బందీ చర్యలకు ప్రణాళికలు కూడా సిద్ధమైపోయాయి.ఈ పరిణామాలు ఇటీవలే రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమికి బిగ్ బూస్ట్ లభించిందని చెప్పక తప్పదు. మొన్నటి ఎన్నికల్లో లభించిన విజయం కంటే కూడా గురువారం నాటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమార స్వామి ప్రకటన కూటమికి అధిక సంతోషాన్ని ఇచ్చిందని చెప్పాలి.

గురువారం ఏపీ పర్యటనకు వచ్చిన కుమారస్వామి… రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, స్థానిక ఎంపీ భరత్, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులతో కలిసి విశాఖ ఉక్కులోకి ప్రవేశించారు. అనంతరం అటు కార్మిక సంఘాలతో పాటుగా ఇటు కంపెనీ అధికారులతో ఆయన వేర్వేరుగా భేటీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కంపెనీ పునరుజ్జీవం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి కూలంకషంగా చర్చించారు. అందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపైనా చర్చలు జరిగాయి. సుదీర్ఘంగానే సాగిన ఈ భేటీల తర్వాత అక్కడే మీడియా ముందుకు వచ్చిన కుమారస్వామి కేంద్రం మాటను విస్పష్టంగా ప్రకటించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని ఈ సందర్బంగా కుమారస్వామి ప్రకటించారు. ప్రైవేటీకరణ మాటను పక్కనపెట్టడంతో పాటుగా కంపెనీకి పునరుజ్జీవం దక్కేలా చర్యలు చేపడతామని తెలిపారు. విశాఖ ఉక్కు కోసం నాడు ఏపీ ప్రజలు చేసిన పోరాటాలు, త్యాగాలను ఆయన గుర్తు చేశారు. 2014 దాకా కంపెనీ మంచి లాభాల్లోనే సాగిందన్న మంత్రి… ఆ తర్వాత నవరత్న హోదా సాధించి ఉప్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలన్న నిర్ణయాలు కంపెనీని నష్టాల బాటలో పయనించేలా చేశాయని తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు రూ.35 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన తెలిపారు.

అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని ప్రైవేటీకరణ చేయాలన్న దిశగా కొంత మేర ఆలోచన చేసినా… ఏపీ ఎంపీలు పదే పదే విశాఖ ఉక్కు గురించి ప్రస్తావిస్తూ… ఏపీ ప్రజల మనోభావాలు దానితో ఎలా ముడిపడి ఉన్నాయన్న విషయాన్ని వివరించారని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలి ప్యాకేజీ వచ్చిందన్నారు. అయితే 2030 నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేలా విశాఖ ఉక్కుకు ప్రదాని మోదీ ఓ లక్ష్యాన్నినిర్దేశించారని ఆయన తెలిపారు. ఇక కార్మికుల సమస్యలను రానున్న 3 నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.

This post was last modified on January 30, 2025 8:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

36 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

8 hours ago