Political News

బాలయ్య ఇలాకాలో టీడీపీ జెండా రెపరెపలు పక్కా

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం పరిధిలో మరోమారు క్యాంపు రాజకీయాలకు తెర లేసింది. హిందూపురం మునిసిపాలిటీకి గత కొంతకాలంగా చైర్ పర్సన్ లేకుండానే కార్యకలాపాలను నెట్టుకువస్తున్నారు. ఈ మునిసిపాలిటీకి గతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం 38 వార్డులకు గానూ 30 వార్డులను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 8 వార్డులకే పరిమితమైంది. వైసీపీ అదికారంలో ఉండగా ఈ మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి.

అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించింది. హిందూపురం నుంచి బాలయ్య హ్యట్రిక్ విజయం సాధించారు. దీంతో మునిసిపాలిటీలో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు బాలయ్య శ్రీకారం చుట్టగా… వైసీపీకి చెందిన పలువురు కౌన్సిలర్లు టీడీపీ వైపు చూశారు. దీంతో 12 మంది వైసీపీ కౌన్సిలర్లను లాగేసిన బాలయ్య…మునిసిపాలిటీపై పట్టు సాధించే యత్నం చేశారు. తాను సొంతంగా గెలిచిన 8 మంది కౌన్సిలర్లకు… వైసీపీ నుంచి వచ్చి చేరిన 12 మంది కౌన్సిలర్లను కలుపుకుని టీడీపీ తన బలాన్ని 20కి పెంచుకుంది. అంటే… ప్రస్తుతం మునిసిపాలిటీలో టీడీపీకి క్లియర్ మెజారిటీ ఉన్నట్టే.

ఈ క్రమంలో హిందూపురం మునిసిపల్ చైర్ పర్సన్ ఎన్నికను నిర్వహించాలన్న డిమాండ్లతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 3న ఈ ఎన్నిక జరగనుంది. దీంతో తమ కౌన్సిలర్లను కాపాడుకునేందుకు టీడీపీ ముందుగానే జాగ్రత్త పడుతోంది. తన ఖాతాలో ఉన్న 20 మంది కౌన్సిలర్లు జారిపోకుండా ఉండేలా క్యాంపు రాజకీయాలను షురూ చేసింది. ఇందులో భాగంగా తన కౌన్సిలర్లను సమీపంలోని పెనుకొండ రిసార్టుకు తరలించింది. చైర్మన్ ఎన్నిక జరిగే ఫిబ్రవరి 3న వారిని నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తీసుకువచ్చేలా టీడీపీ ప్లాన్ చేసింది. దీంతో హిందూపురం మునిసిపాలిటీపై టీడీపీ జెండా ఎగరడం ఖాయంగానే కనిపిస్తోంది.

This post was last modified on January 30, 2025 3:49 pm

Share

Recent Posts

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

42 minutes ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

2 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

12 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

13 hours ago