వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ టూర్ రేపటితో ముగియనుంది. కూతురి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం సతీసమేతంగా లండన్ వెళ్లిన జగన్… ఆ కార్యక్రమం తర్వాత ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. 15 రోజులకు పైగానే లండన్ లో పర్యటిస్తున్న జగన్.. ఆదిలో తన వేర్ అబౌట్స్ తెలియకుండానే జాగ్రత్త పడ్డారు. అయితే ఆ తర్వాత ఆయనకు చెందిన న్యూ లుక్ ఫొటోలు రోజుకు ఒకటి చొప్పున రిలీజ్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి.
గురువారం లండన్ లో ఎంజాయ్ చేస్తున్న జగన్ కు చెందిన మరో ఫొటో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫొటోలో జగన్ పక్కన వైసీపీ యువనేత, ఏలూరు జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కూడా కనిపిపిస్తున్నారు. ఈ ఫొటోలు ఇద్దరు నేతలు చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫొటోలో జగన్ జీన్స్ ప్యాంట్, డెనిమ్ షర్ట్ లో సరికొత్త లుక్కులో కనిపిస్తున్నారు. తన రెగ్యులర్ డ్రెస్ కోడ్ ను లండన్ లో పక్కనపెట్టేసిన జగన్… ఇలా రోజుకో కొత్త రకం డ్రెస్ వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే… గురువారం నాటి జగన్ ఫొటోలో కనిపించిన అబ్బయ్య చౌదరి రాజకీయాల్లోకి రాకముందు విదేశాల్లో సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ఎందుకనో గానీ… ఆయనకు రాజకీయాలపై ఆసక్తి పెరగగా… కొఠారు కుటుంబానికి రాజకీయాలతో పరిచయం ఉన్న నేపథ్యంలో ఈజీగానే గ్రాండ్ ఎంట్రీ లభించింది. వచ్చీ రాగానే…దెందులూరు టికెట్ ను చేజిక్కించుకున్న అబ్బయ్య…2019 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ ను ఓడించి అందరి దృష్టిని ఆకర్షించారు.
This post was last modified on January 30, 2025 9:59 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…