కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో స్వామి వారి సేవలో తరలించాలని కోరుకోని వారు ఉండరు. ఇక రాజకీయ ప్రాదాన్యం కలిగిన వారైతే.. స్వామి వారి సేవ కోసం వచ్చే భక్తులకు ఏర్పాట్లు, స్వామి వారి నిత్య కైంకర్యాల పర్యవేక్షణ కోసం పనిచేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో సభ్యత్వం కోరుకుంటారు. మరింతగా ప్రముఖులైతే… టీటీడీ పాలక మండలి చైర్మన్ పదవిని ఆశిస్తారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే గానీ…ఈ అవకాశం దక్కదు.
ఏపీలో కూటమి సర్కారు పాలన మొదలు పెట్టగానే… టీటీడీ చైర్మన్ పదవి కోసం తెలుగులో ప్రముఖ మీడియా సంస్థ చైర్మన్ బీఆర్ నాయుడు యత్నించారు. నాయుడుకు స్వామిపై ఉన్న భక్తి శ్రద్ధలను గుర్తించిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆయనకే ఆ పదవిని అప్పగించారు. తనపై చంద్రబాబు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రంగంలోకి దిగిన బీఆర్ నాయుడు తనదైన శైలిలో తిరుమలలోని అక్రమాలపై దృష్టి సారించారు.
అక్రమార్కులను తరిమికొట్టారు కూడా. అయితే మొన్నటి తొక్కిసలాట ఘటనతో షాక్ గురైన నాయుడు… ఆ వెంటనే దాని నుంచి తేరుకుని వెంకన్న ఆలనాపాలనలో తనదైన ముద్రను వేసేందుకు నడుం బిగించారు.
శ్రీవారి భక్తులకే కాకుండా…తిరుపతి ప్రజలకు ఆధ్యాత్మిక పులకింతతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని అందించేందుకు నాయుడు ఏర్పాట్లు చేశారు. ఏడుకొండల సుందరీకరణలో భాగంగా తిరుమల నుంచి తిరుపతికి దారి తీసే మొదటి ఘాట్ రోడ్డులోని చివరలో ఉన్న గరుడాద్రి పర్వత శ్రేణుల వద్ద హై ఫోకస్డ్ ల్యాంప్స్ ను ఏర్పాటు చేయించారు. ట్రయల్ రన్ కింద తొలుత 6 ల్యాంప్ లను ఏర్పాటు చేసిన టీటీడీ… ఆ తర్వాత అక్కడి వినాయక స్వామి ఆలయం వద్ద 25 ల్యాంప్ లను ఏర్పాటు చేశారు.
ఇప్పుడీ ల్యాంప్ లు ఇస్తున్నకాంతితో విద్యుదీపాల కాంతుల్లో సప్తగిరులు వెలిగిపోతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన భక్తులు సప్త గిరులు స్వర్ణ శోభితం అయ్యాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఈ ఏర్పాటు ఉన్నా… జగన్ జమానాలో దీనిని నిలిపివేశారని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా. దానినే ఆయన తిరిగి పునరుద్ధరించారు
This post was last modified on January 29, 2025 4:04 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…