ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్న టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఆ పదవిలో సత్తా చాటుతున్నారనే చెప్పాలి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన జీవీ రెడ్డి… ఆర్థికపరమైన నేరాల విషయంలో నిష్షాతుడిగా పేరు సంపాదించారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఈయన యుక్త వయసులోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసి… టీడీపీతో కలిసి సాగుతున్నారు. రెడ్డిగారి చురుకుదనం చూసి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా ఆయనకు మంచి గుర్తింపే ఇచ్చారు. తొలుత పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చిన చంద్రబాబు… పార్టీ అదికారంలోకి రాగానే ఏకంగా ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.
పార్టీ అప్పగించిన పదవులను చేపట్టిన వారంతా ఎలా పనిచేస్తున్నారో తెలియదు గానీ… జీవీ రెడ్డి మాత్రం సత్తా చాటుతున్నారు. చంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా… రెట్టింపు ఫలితాలను రాబడుతున్నారు. వైసీపీ జమానాలో చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు నమోదైన సంగతి తెలిసందే. ఈ కేసును కోర్టులు కొట్టివేసేలా జీవీ రెడ్డి మొత్తం రంగాన్ని సిద్ధం చేశారు. నాడు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పలు లోపాలు ఉన్నాయి. వాటిని వెతికి పట్టి మరీ జీవీ రెడ్డి ఇప్పుడు బయటకు తీశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు ఒకరు చేస్తే… ఎఫ్ఐఆర్ లో మాత్రం ఫిర్యాదుదారుడిగా ఇంకొకరి పేరు ఉందట. ఇదే విషయాన్ని చార్జీ షీట్ లో గుర్తించిన కోర్టు..చార్జీషిట్ నే తిరస్కరించింది.
తాజాగా ఈ కేసులో ఏ1గా వేరే వ్యక్తి పేరు ఉండగా… ఆ తర్వాత ఆ వ్యక్తిని ఏ2గా మార్చేసి…ఏ1గా చంద్రబాబు పేరును చేర్చిన వైనాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీశారు. ఈ వివరాలన్నింటినీ కోర్టుకు సమర్పించి కేసును కొట్టివేయించే దిశగా రెడ్డి కీలక అడుగులు వేస్తున్నారు. ఇక ఫైబర్ నెట్ లో వైసీపీ జమానాలో నియమితులై పనిచేయకుండానే వేతనాలు తీసుకుంటున్న వైసీపీ నేతల అనుచరులు, వాళ్ల ఇంటి పని మనుషులను గుర్తించిన రెడ్డి… వారందరినీ ఒక్క దెబ్బతో ఇంటికి పంపించి వేశారు. ఈ చర్యతో జీవీ రెడ్డి పేరు మారుమోగిపోయింది.
ఇక సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఫైబర్ నెట్ ఖాతా నుంచి రూ.1.15 కోట్లు బదిలీ అయిన విషయాన్ని కూడా జీవీ రెడ్డి బయటకు తీసుకువచ్చారు. అంతటితో ఆగని రెడ్డి… నిబంధనలకు విరుద్ధంగా స్వీకరించిన నిధులను తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇందుకోసం వర్మకు 15 రోజుల సమయం ఇచ్చారు. ఈ గడువు ముగిసిందంటే… వర్మపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడ్డి రంగం సిద్ధం చేసి ఉంచారు కూడా. ఎన్నికలకు ముందు టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యూహం పేరిట వర్మ ఓ సినిమా తీస్తే… దానికి నజరానాగా జగన్ సర్కారు ఫబర్ నెట్ నుంచి ఈ నిధులను ఆయనకు అందజేసిందన్నది ప్రధాన ఆరోపణ. ఇలా తన పరిధిలోని అన్ని విషయాల్లో సత్తా చాటుతున్న రెడ్డి… వైరి వర్గానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
This post was last modified on January 29, 2025 2:42 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…