Political News

దావోస్ లో బాబుది రహస్య వ్యూహం!.. ఇదిగో డీటెయిల్స్!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మంత్రివర్గ సహచరులు నారా లోకేశ్, టీజీ భరత్ లతో కలిసి దావోస్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులను రాబట్టుకునేందుకు ఆయా ప్రభుత్వాలు అక్కడికి వెళతాయని, చంద్రబాబు బృందం కూడా అదే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి బొక్కబోర్లా పడిపోయిందంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ విమర్శలను చంద్రబాబు అండ్ కో అంతగా పట్టించుకోవడం లేదు కూడా. అయితే ఈ వ్యూహం వెనుక చాలా మతలబు ఉందని తాజాగా తేలిపోయింది.

ఏపీ బృందంతో పాటు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులు కూడా దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సందర్బంగా రెండు బృందాలు కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గానూ మారిపోయాయి. అక్కడ జరిగిన భేటీల్లో చంద్రబాబు, రేవంత్ బృందాలు కలిసే కనిపించాయి కూడా. ఏపీ ఒప్పందాలేమీ లేకుండానే తిరిగి రాగా… తెలంగాణ మాత్రం రికార్డు స్థాయిలో రూ.1.78లక్షల కోట్ల ఒప్పందాలతో తిరిగి వచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి దావోస్ అనుభవాలను మీడియాతో పంచుకున్న సందర్భంగా శ్రీధర్ బాబు పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు.

దావోస్ లో ఏపీకి పెట్టుబడులేమీ రాలేదన్నది పూర్తిగా అవాస్తవమని శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్య చేశారు. అదంతా చంద్రబాబు వ్యూహంలో భాగంగానే ఏపీ ప్రతినిధి బృందం జరిగిన ఒప్పందాలను బయటపెట్టలేదని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారన్న విషయానికి వస్తే… “ఏపీకి గ్లోబర్ కేపబిలిటీ ఉంది. చంద్రబాబుది బ్రాండ్ మెంటాలిటీ. చంద్రబాబుతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం తెలిసింది. దావోస్ కు ఆయన బ్రాడ్ థింకింగ్ తో వచ్చారు. ఏపీకి అపార వనరులు ఉన్నాయి. కోస్టల్ ఏరియా అదనపు బలం. ఆ ఏరియాలో మంచి పరిశ్రమలు వస్తాయి. ఏపీ టీమ్ ఆల్రెడీ ఒప్పందాలు చేసుకుంది. అయితే వాటిని దావోస్ లో బయటపెట్టలేదు” అని ఆయన అన్నారు.

మీడయా ప్రతినిధులు మరింత లోతుగా ప్రశ్నించగా దానిని కొనసాగించిన శ్రీధర్ బాబు.. “ఒప్పందాలను ఎందుకు బయటపెట్టడం లేదని లోకేశ్ ను ప్రశ్నించాను.ఈ ఒప్పందాలకు సంబంధించిన ప్రకటనలు అంతా ఏపీలోనే చేస్తామని లోకేశ్ చెప్పారు. దీంతో పెట్టుబడుల విషయంలో వారు ఓ వ్యూహంతో దావోస్ కు వచ్చారని అర్థం అయ్యింది. ఏపీకి ఉన్న అనుకూలతలు, పెట్టుబడులు పెట్టించేందుకు చంద్రబాబు చేసిన యత్నాలు అల్టిమేట్. చంద్రబాబు యత్నాలన్నీ సఫలం అయితే..రేపు మీరే మమ్మల్ని తక్కువ చేసి చూపించే అవకాశం ఉంటుంది.చంద్రబాబు హైదరాబాద్ ను డిస్టర్బ్ చేసే మూడ్ లో లేరు. హైదరాబాద్ ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన కోరుతున్నారు. బాబు మాటలు పెద్దరికంతో ఉన్నాయి” అని ఆయన చంద్రబాబు వ్యూహాన్ని బయటపెట్టేశారు.

ఇక దావోస్ లోని వాతావరణం, దానికి తాము ఇబ్బంది పడిన తీరును కూడా శ్రీధర్ బాబు వివరించారు. ఈ సందర్బంగానూ చంద్రబాబు ఫిట్ నెస్ ను ఆయన ఆకాశానికెత్తేశారు. దావోస్ కు వెళ్లినప్పుడు అక్కడ మైనస్ 8 నుంచి మైనస్ 11 దాకా ఉష్ణోగ్రతలు ఉన్నాయని చెప్పిన శ్రీదర్ బాబు.. ఆ చలిని తట్టుకునేందుకు తామంతా స్వెట్టర్లు వేసుకున్నామని చెప్పిరు. అయితే అంత చలిలోనూ చంద్రబాబు తన రెగ్యులర్ డ్రెస్ లోనే ఉన్నారని తెలిపారు. 70 ఏళ్ల పైబడిన వయసులో కూడా చంద్రబాబు అంత ఫిట్ గా ఉండటం నిజంగానే తనను ఆశ్చర్యానికి గురి చేసిందని శ్రీధర్ బాబు తెలిపారు.

This post was last modified on January 29, 2025 1:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

35 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago