Political News

చిరు చేయి వదలని రేవంత్… అరుదైన సీన్

చిలుకూరు సమీపంలోని ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం’ పార్క్‌ ను సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆసక్తికర సన్నివేశం ఒకటి వైరల్ గా మారింది. ఈ కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే, రిబ్బన్ కటింగ్ సందర్భంగా చిరంజీవితో రేవంత్ రిబ్బన్ కట్ చేయించారు. అంతేకాదు, ప్రతి సందర్భంలోనూ చిరంజీవికి రేవంత్ ప్రాధాన్యతనిచ్చారు.

ఆ తర్వాత జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 150 ఎకరాల విస్తీర్ణంలో రామ్‌దేవ్ రావు అద్భుతాన్ని సృష్టించారని ప్రశంసించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, దాంతోపాటు రాష్ట్ర విలువలు పెరుగుతాయని అన్నారు. తెలంగాణలోని ప్రముఖులు, వారి పిల్లల వివాహాలు టెంపుల్ టూరిజం మెరుగ్గా ఉన్న గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలలో జరుగుతున్నాయని అన్నారు. సరైన ప్రణాళికలు లేక తెలంగాణ ఆ రాష్ట్రాల స్థాయికి చేరుకోలేదని చెప్పారు.

సరైన సదుపాయాలున్నప్పటికీ తెలంగాణకు తగిని ప్రాముఖ్యత లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో టెంపుల్, ఎకో టూరిజానికి ప్రభుత్వం, ప్రముఖులు తగినంత గుర్తింపు ఇవ్వలేదని, అందుకే తెలంగాణలోని పలు ప్రాంతాలు వెనుకబడి పోయాయని చెప్పారు. అందుకే, తమ ప్రభుత్వం టెంపుల్, ఎకో టూరిజంపై ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిందని అన్నారు.

మెడికల్ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ లో ఉన్న అడవిలో మెడిసనల్ ప్లాంట్స్ ఉన్నాయని, టీబీ పేషెంట్లు రెండు నెలల ఇక్కడ ఉంటే సహజసిద్ధంగా నయమవుతుందని సభలో చిరంజీవిని ఉద్దేశించి రేవంత్ చెప్పారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కంటే ముందే రామ్ దేవ్ రావు ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు.

ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఈవెంట్ లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

This post was last modified on January 28, 2025 6:24 pm

Share

Recent Posts

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

1 hour ago

జ్ఞానేష్ కుమార్‌ను ఇప్పటికిప్పుడు తొలగించలేం

కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చ‌రిక చేసింది. ఆయన త‌ప్పు చేసిన‌ట్టు నిరూపిత‌మైతే.. క‌చ్చితంగా…

2 hours ago

మళ్లీ మొదలైన కొలికపూడి పంచాయితీ

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…

2 hours ago

ట్విస్టులు ఆర్టిఫీషియల్ ఉంటే ఎలా

హిందీ దృశ్యం 3 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మొదటి మూడు రోజుల వసూళ్లు 270 కోట్లకు పైగా నమోదు కావడం…

2 hours ago

దాదా వెనక్కు తగ్గే ఉద్దేశంలో లేడా?

షూటింగ్ సమయంలో ప్రమాదం వల్ల గాయపడిన నందమూరి బాలకృష్ణ కోలుకున్నారు. సుమారు రెండు నెలలు విశ్రాంతిలో ఉండి మళ్ళీ సినిమాలతో…

3 hours ago

రిలేషన్ సరే… కంటెంట్ రివీల్ చేయండి

దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి చేతిలో కేవలం పదకొండు రోజులు మాత్రమే ఉన్నాయి. ట్రైలర్…

3 hours ago