రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానంటూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్గి చేసిన ప్రకటన… వైసీపీని ఓ రేంజిలో వణికించిందనే చెప్పాలి. సాయిరెడ్డితో పాటు మరింత మంది వైసీపీ కీలక నేతలు పార్టీని వీడనున్నారన్న వార్తలు ఆ పార్టీ శ్రేణులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. ఇలా సాయిరెడ్డితో పాటు కలిసి పార్టీకి దూరంగా జరిగే నేతల జాబితాలో వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న అయోధ్య రెడ్డి సాయిరెడ్డి వెంట నడవడం ఖాయమన్న వాదనలూ వినిపించాయి.
సాయిరెడ్డి ప్రకటన చేసిన సమయంలో దావోస్ సదస్సులో ఉన్న అయోధ్య రెడ్డి తాను వైసీపీని వీడటం లేదని తెలిపారు. అయితే తాజాగా ఆయన విజయవాడ చేరుకున్నారు. నిన్న రాత్రికే హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజాగా మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను రిసీవ్ చేసుకునేందుకు మాజీ మంత్రి జోగి రమేశ్ ఎయిర్ పోర్టుకు రాగా…జోగితో కలిసి ఒకే కారులో అయోధ్య రెడ్డి విజయవాడ వెళ్లారు.
ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో అయోధ్య రెడ్డిని మీడియా ప్రతినిధులు కదలించగా.. తానేమీ వైసీపీని వీడటం లేదని తెలిపారు. అంతేకాకుండా సాయిరెడ్డి వ్యవహారంపైనా ఆయన తనదైన శైలిలో స్పందించారు. సాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతమని అయోధ్య తెలిపారు. అయితే ఎన్నికల్లో ఓడిన పార్టీకి చెందిన నేతలపై ఒత్తిడి ఉండటం సహజమేనని ఆయన అన్నారు. ఒత్తిడి ఉన్నా తట్టుకుని నిలబడాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీలపై ఏ రీతిన ఒత్తిడి ఉందో ఎమ్మెల్సీలపైనా అంతే స్థాయిలో ఓత్తిడి ఉన్నదని కూడా ఆయన పేర్కొన్నారు.
This post was last modified on January 28, 2025 1:55 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…