Political News

అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పు చేస్తున్నాం: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులపాలైందని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. పథకాల కోసం ప్రభుత్వ నిధులను పప్పు బెల్లాల మాదిరిగా పంచిన జగన్ అందినకాడికి అప్పులు చేసి ఆ భారాన్ని ప్రజలపై మోపారని టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో పలుమార్లు విమర్శించారు. ఈ నేపద్యంలోనే తాజాగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చేసిన అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి ఉందని చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పుల కోసం ఆఖరికి విశాఖలో ఎమ్మార్వో ఆఫీస్ ను కూడా జగన్ తాకట్టు పెట్టారని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. 2022-23లో రాష్ట్రంలోని ఆర్థిక వనరులు ఘోరంగా దెబ్బతిన్నాయని, మూలధన వ్యయం అసలు లేదని చంద్రబాబు చెప్పారు. జగన్ తెచ్చిన అప్పులన్నీ ఏం చేశారో కూడా తెలియని పరిస్థితి ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2022-23లో 67 వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కనీస స్థాయిలో అభివృద్ధి చేయలేదని, ప్రాజెక్టులకు ఖర్చు పెట్టలేదని విమర్శించారు.

స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్-2025 నివేదికపై చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కోసం రూపొందించిన నివేదికలో ఏపీ అట్టడుగు స్థానంలో ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసిన డబ్బులను జగన్ సర్కార్ దుబారా చేసిందని, రాష్ట్ర ఆదాయం 17.1% నుంచి 9.8 శాతానికి పడిపోయిందని గుర్తు చేశారు. కానీ అప్పులు మాత్రం 16.5% పెరిగాయని చెప్పారు. ఎక్కువ వడ్డీకి అప్పులు తెచ్చి పన్నులు పెంచడం వంటి అంశాల వల్ల రాష్ట్రం అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఫైర్ అయ్యారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకుంటే ప్రజలపైనే పన్నుల భారం పడుతుందని, జగన్ వంటి నాయకుల అసమర్థత వల్ల ప్రజలకు, రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు చెప్పారు. తలసరి ఆదాయంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకోలేని దుస్థితిలో ఏపీ ప్రజలు ఉన్నారని, ప్రజలకు కొనుగోలు శక్తి కూడా తగ్గిపోయిందని చెప్పారు. 2019 వరకు తలసరి అప్పు 74,790 అని, కానీ 2024 లో అది 1.44 లక్షలకు చేరిందని గుర్తు చేశారు.

అప్పులు తీర్చకుంటే రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో పెడతారని, ఆ తర్వాత ఏపీకి అప్పు పుట్టే పరిస్థితి ఉండదని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టి జరుగుతుందని తద్వారా సంక్షేమం చేసి మళ్లీ సంపద సృష్టిస్తామని ఈ సైకిల్ ఇలా కొనసాగుతూ ఉంటుందని చంద్రబాబు అన్నారు. వైసీపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్ల ఈ సైకిల్ గాడి తప్పిందని చెప్పారు.

This post was last modified on January 27, 2025 8:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

2 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

3 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

3 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

5 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

5 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

5 hours ago