టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా రెండేళ్లు నిండాయి. ఓ విభిన్న లక్ష్యంతో చేపట్టిన ఈ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా లోకేశ్ సఫలం అయ్యారు కూడా. లోకేశ్ యాత్ర ఫలితంగా ఏపీలో తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ దఫా గతంలో కంటే రికార్డు మెజారిటీతో టీడీపీ అధికారం చేపట్టడం గమనార్హం. ఈ పాదయాత్ర ద్వారా టీడీపీ శ్రేణుల్లో ప్రత్యేకించి రాష్ట్ర ప్రజల్లో కోల్పోయిన విశ్వసాన్ని పాదుకొల్పిన లోకేశ్ తీరు నిజంగానే ప్రశంసలందుకొంది. జనసేన, బీజేపీలను టీడీపీకి దగ్గర చేసింది. మూడు పార్టీల కూటమి బలంగా కనిపించిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి 94 శాతం సక్సెస్ రేటును సాధించి జాతీయ రాజకీయాల్లో ఓ స్పెషట్ గా నిలిచింది.
రాష్ట్ర విభజన తర్వాత అప్పుల్లో కూరుకునిపోయి… కనీసం రాజధాని కూడా లేని ఏపీని గట్టెక్కించగలగడం ఒక్క టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికే సాధ్యమని భావించిన రాష్ట్ర ప్రజలు టీడీపీకి అధికారం ఇచ్చారు. దీంతో ఆ ఐదేళ్లలోనే చంద్రబాబు తనదైన మార్కును చూపించారు. మరో ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో ఉండి ఉంటే.. ఏపీ భవిష్యత్తు రూపురేఖలే మారిపోయి ఉండేవి. అయితే ఒక్క ఛాన్స్ అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన నినాదంతో రాష్ట్ర ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెట్టారు. ఆపై తనదైన శైలి నిర్ణయాలతో జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటు అభివృద్ధిని విధ్వంసం చేశారు. గళం విప్పిన విపక్షాలపై క్రూరమైన దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు విపక్షాలతో పాటు రాష్ట్ర ప్రజల్లోనూ తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఫలితంగా తమకు భరోసా ఇచ్చే నేత ఎవరన్న దిశగా ప్రజలు ఎదురు చూశారు.
సరిగ్గా… ఇలాంటి సమయంలోనే లోకేశ్ రంగంలోకి దిగారు. అధికార పార్టీ దాడుల్లో బలి అవుతున్న నేతల కుటుంబాలకు బాసటగా నిలుస్తూ సాగిన లోకేశ్… ఈ క్రూర సంస్కృతిని మార్చాలంటే ఇంకేదో చేయాలన్న దిశగా ఆలోచించారు. అప్పుడే ఆయన మదిలో పాదయాత్ర మెదిలింది. సాధారణంగా తెలుగు నేలపై చాలా మంది నేతలు పాదయాత్రలు చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా పాదయాత్ర చేపట్టి ఏపీకి సీఎం అయ్యారు. తదనంతరం జగన్ కూడా అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు పాదయాత్రే మార్గమని భావించారు. ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి ఆయన అధికారంలోకి వచ్చారు.
అయితే అధికారం దక్కించుకోవాలన్న లక్ష్యంతో పాదయాత్ర చేపట్టేందుకు లోకేశ్ మనసెందుకో ఒప్పుకోలేదు. మరేం చేయాలి? విపక్షాలకు చెందిన కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగిస్తూ… వారిలో కొత్త విశ్వాసాన్ని పాదుకొల్పడం ఎలా అంటూ లోకేశ్ మేధోమథనం చేశారు. గతంలో నేతలు అధికారంలో కోసమే యాత్ర చేస్తే… తాను ఇప్పుడు ప్రజల్లో విశ్వసాన్ని పాదుకొల్పడానికి యాత్ర చేయడంలో తప్పేముందని భావించారు. అనుకున్నదే తడవుగా యువగళం పేరిట రాష్ట్రవ్యాప్తంగా సుదీర్గ పాదయాత్రకు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. ఈ సరికొత్త ప్రతిపాదనకు చంద్రబాబు కూడా సరేనని చెప్పడమే కాకుండా భుజం తట్టడంతో సరిగ్గా.. రెండేళ్ల క్రితం ఈ రోజే (జనవరి 27, 2023) లోకేశ్ యువగళం రెడ్డెక్కింది.
తన తండ్రిని నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తూ వస్తున్న కుప్పం ప్రజలకు సంఘీభావంగా లోకేశ్ తన పాదయాత్రను కుప్పం నుంచే ప్రారంభించారు. ఆ తర్వాత లోకేశ్ యాత్రం అప్రతిహాతంగా ముందుకు సాగింది. జగన్ సర్కారు అరాచకాలపై అప్పటిదాకా నోరెత్తడానికే భయపడ్డ ప్రజలు… లోకేశ్ ఇచ్చిన ధైర్యంతో రొమ్ము విరుచుకుని మరీ యువనేత వెంట అడుగులో అడుగు వేశారు. ఇక టీడీపీ శ్రేణులు అయితే… రెండింతలు, మూడింతల ఉత్సాహంతో లోకేశ్ యువగళాన్ని హెరెత్తించాయి. కుప్పం నుంచి బయలుదేరిన ఈ యాత్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాలను స్పృశిస్తూ… శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దాకా సాగింది. అయితే జగన్ సర్కారు కలిగిన ఆటంకాలతో పలుమార్లు విరామం తీసుకున్న లోకేశ్… తాను నిర్దేశించుకున్నట్లుగా 4 వేల కిలో మీటర్ల దూరం నడిచి ప్రజల్లో విశ్వాసాన్ని నింపారు.
లోకేశ్ యువగళం 226 రోజుల పాటు నిర్విరామంగా సాగి… ఇచ్ఛాపురంలో ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వచ్చిన జనాన్ని చూసిన లోకేశ్… 2024 ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిస్తానన్న నమ్మకాన్ని ప్రోది చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన, బీజేపీలతో తిరిగి పొత్తు కుదిరేలా లోకేశ్ అమలు చేసిన వ్యూహాలు కూడా యువగళం ఫలితంగా సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. ఇద్దరు పాత మిత్రులతో రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగిన లోకేశ్… కూటమిని రికార్డు స్థాయిలో 94 శాతం సక్సెస్ రేటుతో గెలిపించారు. లోకేశ్ ఫ్యాక్టర్ కారణంగా జనసేన ఏకంగా 100 శాతం సక్సెస్ రేటును సాదించింది. ఇక అరాచక పాలనకు కేరాఫ్ గా నిలిచిన వైసీపీని 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయేలా లోకేశ్ వ్యూహాలు అమలు చేశారు. కేవలం అధికారం కోసమే పాదయాత్ర చేసి ఉంటే… ఈ ఫలితం వచ్చేది కాదన్న రాజకీయ పండితులు…లోకేశ్ ఎంచుకున్న విభిన్న లక్ష్యమే ఈ రికార్డు విక్టరీని అందించిందని విశ్లేషించారు.
This post was last modified on January 27, 2025 12:49 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…