నారా చంద్రబాబునాయుడు.. దేశంలోనే సీనియర్ మోస్ట్ నేతగానే కాదు.. ఏ విషయంలో ఎంతదాకా స్పందించాలో తెలిసిన నేత. ఏ విషయంలో విరుచుకుపడాలో… ఏ విషయంలో నిగ్రహంతో మెలగాలో తెలిసిన నేత. తనలోని భావాలను అణచుకునే శక్తి కలిగిన నేత. ఇతరుల విషయాల్లో అసలు వేలు పెట్టేందుకు ససేమిరా అనే నిబద్ధత కలిగిన నేత. ఇక వ్యూహాలను అమలు చేయడంలో చతురత కలిగిన నేతగా చంద్రబాబుకు మంచి రికార్డులే ఉన్నాయి.
దాదాపుగా 45 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న చంద్రబాబు..తన రాష్ట్రం, తన రాష్ట్ర ప్రజల కోసమే ఆలోచిస్తూ… జాతీయ రాజకీయాల్లో ఎంత కల్పించుకోవాలో.. అంతవరకే కల్పించుకుంటూ సాగుతున్న నేతగా అందరికీ ఆదర్శవంతుడు. అలాంటి నేతను చూస్తూ… ఆయనతో కలిసి ఏళ్లుగా నడుస్తూ సాగుతున్న నేతలు చాలా మంది నేతలు..ఆయనలోని సుగుణాలను అవరచుకోవడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదు. అసలు మన లిమిట్ ఎంతవరకు అన్న విషయాన్ని చంద్రబాబును చూసి ప్రతి రాజకీయ నేత కూడా నేర్చుకోవాలన్న వాదనలు గడచిన రెండు రోజులుగా బాగానే వినిపిస్తున్నాయి.
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం ప్రకటించిన వైనం గుర్తుంది కదా. తన వ్యక్తిగత కారనాలతో రాజకీాయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పిన సాయిరెడ్డి… రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే వైరి వర్తాలుగా అటు టీడీపీ అయినా, ఇటు బీజేపీ, జనసేనలకు చెందిన నేతలైనా సాయిరెడ్డి నిష్క్రమణపై స్పందించవచ్చు. అయితే ఎంతవరకు స్పందించాలన్న దానిని మాత్రం ఎవరికి వారే నిర్దేశించుకోవాలి. ఈ విషయంలో అందరు నేతలకు చంద్రబాబు ఆదర్శమని చెప్పక తప్పదు.
దావోస్ పర్యటన వివరాలు వెల్లడించేందుకు శనివారం మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు… సాయిరెడ్డి రాజకీయ సన్యాసంపై వచ్చిన ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా స్పందించారు. ఆ విషయం వైసీపీ అంతర్గత విషయమని చంద్రబాబు తేల్చి పారేశారు. అంతేకాకుండా నాయకులు నమ్మకం కోల్పోతే ఆ పార్టీలో నేతలు నిలబడరని చెప్పిన చంద్రబాబు.. ఆ పరిస్థితి వైసీపికి సరిగ్గా సరిపోతుంది అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంతకుమించి తాను ఆ విషయంపై స్పందించలేనని కూడా చంద్రబాబు ఓపెన్ గానే చెప్పేశారు.
సాయిరెడ్ది రాజకీయ సన్యాసం నిజంగానే వైసీపీ అంతర్గత వ్యవహారం. అదేదో తమకు నష్టం చేకూర్చిందన్నట్లుగా చాలా మంది టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సాయిరెడ్ది సన్యాసంపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అయితే వీరంతా ఎంతగా నోరు పారేసుకున్నా.. చంద్రబాబు సౌమ్యంగా చేసిన వ్యాఖ్యలే వైసీపీకి చెంపపెట్టులా నిలిచాయని చెప్పాలి. జగన్ పేరు ఎత్తకుండానే…నాయకుడు నమ్మకం కోల్పోయారంటూ చంద్రబాబు చేసిన కామెంట్ నిజంగానే వైసీపీలోని తాజా పరిస్థితిని జనం కళ్లకు కట్టింది. అంతలా నోరేసుకుని విరుచుకుపడిన నేతల విమర్శలు చంద్రబాబు స్పందనకు వచ్చిన ఫలితంలో ఆవగింజంత కూడా సాధించలేకపోయాయి.
అదేంటీ.. వైసీపీ అదికారంలో ఉండగా… సాయిరెడ్డి తమను దారుణంగా దూషించారని, అలాంటిది ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పించుకుని పారిపోతే నోరు మూసుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించే నేతలు కూడా ఉన్నారు. ఈ విషయానికి వచ్చినా.. అందరి కంటే కూడా సాయిరెడ్డి అంశంపై చంద్రబాబే ఘాటుగా స్పందించాలి. ఎందుకంటే… నేరుగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి సంధించిన పోస్టులను ఓ సారి గుర్తు చేసుకుంటే… ఈ మాట వాస్తవమేనని చెప్పాలి. సాయిరెడ్డి నుంచి దారుణమైన దూషణలను తిన్న చంద్రబాబే అంత నిగ్రహం పాటించి రాజకీయాలకు విలువ తీసుకొస్తుంటే…ఆయన కింద ఉన్న నేతలు మాత్రం ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరీ విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on January 27, 2025 10:18 am
అందని ఎత్తులో ఉన్న వాళ్ళను లక్ష్యంగా చేసుకునే బ్యాచ్ సోషల్ మీడియాలో అంతకంతా పెరుగుతోంది. దానికి దర్శక ధీర రాజమౌళి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ నిజంగానే ప్రతి విషయంలోనూ వెరీ వెరీ స్పెషల్ అని…
భారత 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై తెలంగాణలో రచ్చ మొదలైంది.…
సమాజం మీద సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం పాజిటివ్ గా ఏమో కానీ నెగటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుందనే దానికి…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన ప్రతిష్ఠాత్మక యువగళం పాదయాత్రకు నేటితో సరిగ్గా…
వస్తువైనా సినిమా అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెటింగ్ చాలా అవసరం. లేదంటే జనాలు పట్టించుకోకపోయే ప్రమాదముంది. ప్యాన్ ఇండియా మూవీకి…