పరిపాలనా దక్షతలో చంద్రబాబుకు మించినోడు ఉండరని.. ఎవరిని ఏ పనికి వాడుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. తెలుగు తమ్ముళ్లు అయితే.. ఈ విషయాన్ని చిలువలు వలువలుగా చెప్పుకుంటుంటారు.
అంత మంచి ఆడ్మినిస్ట్రేర్ అయిన బాబుకు.. తన గురించి తాను ఎప్పుడు మాట్లాడుకోవాలో? ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలీదా? అన్నది అసలు ప్రశ్న. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎవరి గొప్పతనం గురించి వారు చెప్పుకుంటే బాగోదు. అందులోకి బాబు లాంటి వారికి అస్సలు సూట్ కాదు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంగతే చూడండి. అబద్ధాల్ని సైతం ఎంత అందంగా చెబుతారో ఆయన దగ్గరే చూసి నేర్చుకోవాలి. తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే. ఆ విషయంలో మారో మాటకు తావు లేదని చెప్పటమే కాదు.. తేడా వస్తే తన తల తెగుతుందే తప్పించి.. మాట తేడా అన్నది తన వంశంలోనే ఉండదన్న మాట మాట్లాడతారు. మరేం జరిగిందో అందరికి తెలుసు. మరి.. ఆ విషయాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం ఎక్కడా కనిపించదు. ఎవరైనా ఆ దుస్సాహసం చేస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో సారుకు బాగా తెలుసు.
కానీ.. బాబుకు ఇలాంటి విషయాల మీద పట్టు తక్కువే. తన మనసుకు తోచింది చెప్పుసుకుంటూ పోవటమే. చివరకు తాను రోజుకు పద్దెనిమిది గంటలు పని చేసిన విషయాన్ని ఆయనే చెప్పుకోవాలే తప్పించి.. అంత పెద్ద తెలుగుదేశం పార్టీలో నేతలెవరూ ప్రస్తావించరు. తనకున్న విజన్ గురించి బాబు చెప్పుకోవాల్సిన దుస్థితి. అదే సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయానికి వస్తే ఆయనకున్న దూరదృష్టి గురించి గులాబీ నేతలు గొప్పగా చెప్పుకోవటం కనిపిస్తుంది.
ఏడేళ్ల క్రితం తాను చేసిన పాదయాత్ర ముగింపు గురించి.. ఆ సందర్భంగా తాను పడిన శ్రమ గురించి బాబే చెప్పుకోవాలే కానీ.. ఆయన విధేయులెవరూ ముందుకు రారు. ఎంతసేపటికి తన డప్పు తాను కొట్టుకోవటమే కానీ..సమయానికి అనుగుణంగా బాబు డప్పును తమ్ముళ్లు కొడితే బాగుంటుంది కదా?
This post was last modified on April 29, 2020 3:03 pm
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…