వైసీపీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన రాజీనామాపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి వంటి నాయకులే జగన్ ను వదిలేస్తున్నారంటే వైసీపీలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని షాకింగ్ కామెంట్లు చేశారు. నాయకుడిగా జగన్ ఓడిపోయారని, విశ్వసనీయతను కోల్పోయిన నాయకుడు జగన్ అని విమర్శించారు.
జగన్ అనుమతి లేకుండా విజయసాయిరెడ్డి రాజీనామా చేయరని, ఆయన పార్టీని వీడడం చిన్న విషయం కాదని అన్నారు. విజయసాయిరెడ్డిని జగన్ పక్కా ప్లాన్ తో బీజేపీలోకి పంపుతున్నారని షర్మిల ఆరోపించారు. విజయసాయి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు నిజాలేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల తర్వాత ఒక్కొక్కరిగా జగన్ ను వదిలి వెళ్లిపోతున్నారని షర్మిల అన్నారు.
బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని, బీజేపీ దగ్గర విజయసాయిని ఉంచి కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని షర్మిల ఆరోపించారు. వివేకా హత్య కేసులో జగన్ చెప్పమన్న అబద్దాలు విజయసాయి చెప్పారని, ఇప్పటికైనా ఆయన నిజాలు చెబితే ప్రజలు హర్షిస్తారని అన్నారు. తన కుటుంబంపై, తనపై, తన పిల్లలపై ఇష్టం వచ్చినట్లుగా విజయసాయి విమర్శలు చేశారని గుర్తు చేసుకున్నారు.
This post was last modified on January 26, 2025 10:08 am
ట్రెడిషనల్ హీరోయిన్‌గా ముద్ర పడ్డ ఐశ్వర్యా రాజేష్ లాంటి హీరోయిన్ల గురించి ఎఫైర్ రూమర్లు రావడం అరుదు. ఐశ్వర్య ఫలానా…
ఈ వేసవిలో టాలీవుడ్ నుంచి రాబోతున్న ఏకైక భారీ చిత్రం.. కన్నప్ప. రాజా సాబ్, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలు…
గత ఏడాది అమరన్ రూపంలో ఊహించని బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి త్వరలో ప్రభాస్ తో…
ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్ డ్రైవింగ్.. తదితరాలపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్…
కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం లైలా పై కొనసాగుతున్న వివాదానికి ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడిందని…