రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టే దిశగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులకు హాజరయ్యే నిమిత్తం స్విట్జర్లాండ్ నగరం దావోస్ వెళ్లిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రానికి అమరావతి చేరుకున్నారు. వచ్చీ రాగానే… కార్యరంగంలోకి దిగిపోయిన చంద్రబాబు… శుక్రవారం సాయంత్రమే ఉండవల్లిలోని తన అధికారిక నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ తో పాటుగా ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించేందుకే తాను దావోస్ వెళ్లానని ఆయన పేర్కొన్నారు. తాను అనుకున్న దానిని దిగ్విజయంగానే పూర్తి చేశానని తెలిపారు. రాష్ట్రంలోని అవకాశాలను పెట్టుబడిదారుల ముందు ఉంచానని తెలిపారు. ఇందులో భాగంగా అందుబాటులో ఉన్న దిగ్గజ సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల ప్రముఖులతో సమావేశమైనట్లు తెలిపారు.
ప్రభుత్వం తరఫున తాము ఇచ్చిన ప్రజెంటేషన్లను సావదానంగా విన్న దిగ్గజ సంస్థల అధిపతులు, ప్రతినిధులు త్వరలోనే రాష్ట్రానికి వస్తామని తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలో దిగ్గజ సంస్థల ప్రతినిధి బృందాలు త్వరలోనే రాష్ట్రానికి రానున్నాయని తెలిపారు. వారు వచ్చినప్పుడు… వారికి అవసరమైన వివరాలను సమగ్రంగా అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పిందే దిశగా ప్రణాళికలు సిద్దం చేయాలని కూడా చంద్రబాబు ఆదేశించారు.
వెరసి రాష్ట్రానికి దిగ్గజ కంపెనీలు రప్పించడం అనే కీలకమైన బాధ్యతను తాను నెరవేర్చానని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం. తమ కృషి వల్ల రాష్ట్రానికి వస్తున్న దిగ్గజ కంపెనీలతో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, రాష్ట్రానికి వచ్చే ఏ ొక్క దిగ్గజ కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టకుండా వెనక్కు వెళ్లడానికి వీల్లేని దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దావోస్ లో తాము చేసిన కృషికి కొనసాగింపుగా పకడ్బందీ చర్యలు చేపడితే రాష్ట్రానికి పెట్టుబడులు పోటెత్తడం ఖాయమేనని, ఆ దిశగా సిద్ధం కావాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
This post was last modified on January 25, 2025 11:57 am
ఇటీవలే కల్ట్ క్లాసిక్ సత్య రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దానికొచ్చిన స్పందన చూసి తనకు…
రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానంటూ వైసీపీ కీలక నేత వేణుంబాక విజయసాయిరెడ్డి.. తన నిష్క్రమణ పర్వంలో మిగిలి ఉన్న కార్యాన్ని కూడా…
క్రికెట్ మ్యాచ్ చివర్లో వచ్చి సెంచరీ కొట్టి గెలిపించిన టైపులో సంక్రాంతికి వస్తున్నాం బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతూనే ఉంది. పది…
గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రాజకీయ నాయకుడు ఎవరన్న ప్రశ్నను అడిగితే.. ఏ ఒక్కరు…
గడిచిన రెండు దశాబ్దాల్లో తెలుగు రాజకీయాల ధోరణి పూర్తిగా మారింది. గతంలో ఇందుకు భిన్నమైన రాజకీయ వాతావరణం ఉండేది. ఫలానా…
వైసీపీకి బిగ్ షాక్… ఇతర పార్టీలకు ఆశ్యర్చాన్ని కలగజేస్తూ రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి వ్యవహారంపై పెద్ద చర్చే నడుస్తోంది.…