“ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా? అంటే.. ఉంటే ఉన్నట్టు.. లేదంటే లేనట్టు!”- జాతీయ స్థాయి నాయకుడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ రెండు మూడు రోజుల కిందట ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలు ఇవి. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దిగ్వి జయ్‌కు తెలుగు రాష్ట్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇక్కడ ఇంచార్జ్‌గా పనిచేశారు. సో.. ఆయనకు సరైన అవగానే ఉంది. కాబట్టి ఆయనే ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇలా ఎందుకు?
వాస్తవానికి గత ఏడాది ఫిబ్రవరి ముందు వరకు.. ఏపీ కాంగ్రెస్ వేరు. తర్వాత పరిస్థితి వేరు. అప్పటి వరకు ఉన్న నాయకత్వాన్ని పక్కన పెట్టి.. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెకు పగ్గాలు అప్పగించిన తర్వాత.. పార్టీ పరిస్థితి మలుపు తిరుగుతుందని, ఇక, తిరుగు లేదని ఒక సంకేతం అయితే వచ్చింది. సరిగ్గా ఎన్నికలకు రెండు మాసాల ముందు షర్మిల పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. అయినా.. ఒక్క ఎమ్మెల్యేను కూడా ఆమె గెలిపించుకోలేక పోయారు. కనీసం తను డిపాజిట్లు దక్కించుకోలేక పోయారు.
అప్పట్లో అంటే.. ఎన్నికలకు ముందు సమయం సరిపోలేదన్న వాదన షర్మిల అనుచరులు, ఆమెను సపోర్టు చేసేవారు చెప్పుకొచ్చారు. కేవలం రెండు మాసాల్లోనే ఉత్తమ ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ, ఎన్నికల అనంతరం.. పరిస్థితి కూడా అలానే ఉంది. ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పార్టీ పరిస్థితి మారిపోయింది. దీనికి ఎవరు బాధ్యులు? అనేది ప్రశ్న. వాస్తవానికి షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టి.. మరో రెండుమూడు వారాల్లో ఏడాది పూర్తవుతోంది.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీనికి రీజనేంటనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఆమె ఒంటెత్తు పోకడలు పోతున్నారన్నది.. కొందరు చెబుతున్న వాదన అయితే.. అసలు షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నవారు.. గత మూడు నాలుగు మాసాల నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారన్నది కూడా.. తెలుస్తోంది. ఈ పరిణామాలకు తోడు నిజంగానే షర్మిల సొంత అజెండాను అమలు చేయడం కూడా పార్టీకి పెద్ద దెబ్బగా మారింది. కేవలం జగన్‌ను టార్గెట్ చేసుకుని ముందుకు సాగుతున్నారన్న మచ్చ ఆమెపై పడింది. ఇదే.. ఇప్పుడు కేంద్రం స్థాయిలోనూ సీనియర్లను పెదవి విరిచేలా చేస్తుండడం గమనార్హం.
This post was last modified on January 24, 2025 7:09 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…