ఇటీవలి కాలంలో ఏపీలో సుబ్బారాయుడు పేరు పలుమార్లు హెడ్ లైన్స్ లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ పోలీస్ అధికారిగా ఉన్న సుబ్బారాయుడు ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్నారు. సుబ్బారాయుడు ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితులంటూ స్వయంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టేందుకే ఆయనను తెలంగాణ నుంచి ఏపీకి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే… సుబ్బారాయుడు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుని వస్తామంటూ జగన్ పవర్ పంచ్ డైలాగ్ సంధించారు.
ఇక ఇటీవల తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన సమయంలోనూ సుబ్బారాయుడు ప్రస్తావన బాగానే వినిపించింది. తొక్కిసలాట సమయంలో తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్న సుబ్బారాయుడును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డీఎస్పీని సస్పెండ్ చేసిన చంద్రబాబు సర్కారు.. తనకు ఇష్టమైన సుబ్బారాయుడిని మాత్రం బదిలీతో సరిపెట్టిందని వైసీపీ విమర్శలు సంధించింది. అయితే ఈ విమర్శలను అంతగా పట్టించుకోని చంద్రబాబు… సుబ్బారాయుడును బదిలీ చేసి ఎక్కడికో శంకర గిరి మాన్యాలకు పంపకుండా… తిరుపతిలోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. తిరుపతి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు నియమితులు అయ్యారు.
ఈ పోస్టు దాదాపుగా రాష్ట్ర స్థాయి పోస్టు కిందే లెక్క. ఎర్రచందనం అక్రమ తరలింపుపై ఎక్కడైనా ఈ టాస్క్ ఫోర్స్ దాడులు చేయవచ్చు. ఎర్రచందనాన్ని పట్టుకోవచ్చు. స్మగ్లర్లను అరెస్ట్ చేయవచ్చు. ఈ పోస్టులో అలా చేరారో, లేదో సుబ్బారాయుడు పంజా విసిరారు. పుష్ప సినిమాలో షెకావత్ మాదిరిగా… మాటు వేసి మరీ కోట్ల రూపాయల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టేసుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఓ కంటైనర్ లారీతో పాటు ముగ్గురు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఆయన పట్టేశారు. ఇటీవలి కాలంలో ఓ కంటైనర్ నిండా సరుకును పట్టుకోవడం ఇదే ప్రథమమని చెప్పాలి.
సుబ్బారాయుడు అదిరేటి పంచ్ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే…చిత్తూరు నగరంలో జిల్లా కలెక్టరేట్ నుంచి కొన్ని కిలో మీటర్ల దూరం వెళితే… రాష్ట్ర సరిహద్దు దాటేసి తమిళనాడులో అడుగుపెట్టవచ్చు. అంతా అటవీ ప్రాంతమే. గుడిపాల మండలంలోని మూడు గ్రామాలు దాటితే అంతరాష్ట్ర సరిహద్దు వచ్చేస్తుంది. అక్కడికి సమీపంలో అటవీ దారి నుంచి వచ్చే రోడ్డును ప్రధాన రహదారిలో కలిపేందుకు ఓ అండర్ పాస్ ఉంది,. సుబ్బారాయుడు తన బృందంతో అక్కడే కూర్చున్నారు. అదే సమయంలో అటుగా మెయిన్ రోడ్డు ఎక్కుతున్న కంటెయినర్ ను తనిఖీ కోసం నిలపగా… దానిని వదిలేసి స్మగ్లర్లు పరారయ్యేందుకు యత్నించారు. దీంతో అలర్ట్ అయిన సుబ్బారాయుడు బృందం.. వారిని పట్టేసి… కంటెయినర్ ను ఓపెన్ చేయగా… రూ.4.5 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. ఇంకేముంది… కంటెయినర్ సహా ఎర్రచందనాన్ని గోడౌన్ కు తరలించిన సుబ్బారాయుడు టీం… పట్టుబడ్డ స్మగ్లర్లను అంతరాష్ట్ర స్మగ్లర్లుగా గుర్తించి కటకటాల వెనక్కి పంపింది.
This post was last modified on January 24, 2025 9:54 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…