సజ్జల రామకృష్ణారెడ్డి. వైసీపీలో నాయకుడు, వ్యూహాత్మక నేత, సీఎం రాజకీయ సలహాదారు. ఇంత వరకేనా ఆయన విధులు. అంటే.. కాదని అంటున్నారు వైసీపీ నాయకులు. ఆయన షాడో చీఫ్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్నారని పార్టీలో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. తమకు ఏదైనా సమస్య వస్తే.. నేరుగా సీఎం జగన్‌కు చెప్పుకొనే అవకాశం ఏనాడో పోయిందని నేతలు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. తమ సమస్యలను చెప్పుకొనేందుకు సీఎం అవకాశం ఇవ్వడం లేదని.. ఏదైనా ఉంటే.. సజ్జలసార్‌తో మాట్లాడండి.. అని సీఎంవో నుంచి సమాచారం అందుతోందని.. పోనీ వెళ్లిఆయనకు సమస్య చెప్పినా.. వెంటనే పరిష్కారం అయ్యే అవకాశం లేదని అంటున్నారు.
ఇది కొందరి మాట. మరికొందరు ఏమంటున్నారంటే.. సజ్జల తనకు అనుకూలంగా ఉండే వారికి పనులు చేస్తున్నారని.. చెబుతున్నారు. తాజాగా గుంటూరు ఘటన వెలుగు చూసిన తర్వాత.. ఈ విషయంపై నేతలు బహిరంగ వ్యాఖ్యలే చేస్తున్నారు. గుంటూరులో ఓ ఎంపీ-ఎమ్మెల్యే మధ్య తీవ్ర వివాదం జరుగుతోంది. వాస్తవానికి ఇది అంతర్గత విషయం. ఇప్పటికే ఎంపీ.. సదరు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తనకు స్వేచ్ఛలేకుండా చేస్తున్నారని, దీనిని పరిష్కరించాలని, తన కారుపై దాడికి ఇప్పటికే రెండు సార్లు ప్రయత్నించారని.. ఇలా అయితే..ఎలా? అంటూ ఎంపీ తన ఆవేదనను సజ్జల వద్దే చెప్పుకొచ్చారు.
అయినా.. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాకపోగా.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసేసుకున్నారు. ఇక, ప్రకాశంలో నేతలు రెండు నియోజకవర్గాల విషయంలో ఘర్షణ పడుతున్నారు. కొండపిలో ఇంచార్జ్ మాదాసు వెంకయ్య సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అదేసమయంలో అద్దంకిలో చెంచు గరటయ్య కుమారుడు చైతన్య కూడా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఏదైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీనిని కూడా సజ్జలకే రిఫర్ చేశారు. ఆయన మాత్రం మీలో మీరు తేల్చుకుని రండి అప్పుడు చూద్దాం.. అని ముక్తాయించారు.
పైగా ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకుంటాం.. అప్పుడు మీ తిక్క అణుగుతుంది! అని దురుసుగా వ్యాఖ్యానించారట. దీంతో సజ్జల వ్యవహారంపై నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, నియోజకవర్గం నిదుల విషయంలో సీఎంతో తమ గోడు విన్నవించుకునేందుకు ఎమ్మెల్యేలు వచ్చినా..అప్పాయింట్‌మెంట్ ఇప్పించడం లేదు. పైగా ఎప్పుడూ నిధులు నిధులు అంటారు నొక్కేయడానికా? సీఎంకు అన్నీ తెలుసు.. అంటూ.. అవమానకరరీతిలో మాట్లాడుతున్నారని ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు.
ఇవన్నీ.. బహిరంగ రహస్యాలే! కానీ.. ఎవరూ పైకి చెప్పరు. కొందరు బయట పడితే.. వారికి చెక్ పడుతోంది. ఈ పరిణామాలతో వైసీపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ షాడో మంత్రితో వేగలేకపోతున్నామంటూ.. సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. మరి ఈ పరిస్థితి మారుతుందా? లేక ఇదే కొనసాగుతుందా చూడాలి. ఇదే కొనసాగితే.. ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 17, 2020 10:34 am
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు…
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా…
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే…
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే..…
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్…