Political News

16 ఒప్పందాలు.. 50 వేల ఉద్యోగాలు..రూ.1.78 లక్షల కోట్లు

స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు పెట్టేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను వెత్తుక్కుంటూ అక్కడికి పారిశ్రామికవేత్తలు వస్తుంటే… ఆ పెట్టుబడులను తమ ప్రాంతాల్లో పెట్టాలంటూ కోరేందుకు ఆయా దేశాలు, రాష్ట్రాల ప్రభుత్వాల ప్రతినిధులు వస్తున్నారు. ఈ దఫా కూడా ప్రపంచంలోని చాలా దేశాలు అక్కడికి వచ్చాయి. వాటిలో భారత్ కూడా ఉంది. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఉన్నాయి.

పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ సర్కారు సత్తా చాటింది. గత రికార్డులను తిరగరాస్తూ… రాష్ట్ర చరిత్రలోనే అత్యథిక పెట్టుబడులను రాబట్టి ఔరా అనిపించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన… మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులతో కూడిన బృందం దావోస్ వెళ్లిన సంగతి తెలిసిందే. వరుసబెట్టి 4 రోజుల పాటు తనదైన శైలిలో సత్తా చాటిన తెలంగాణ ప్రతినిధి బృందం…తాను నిర్దేశించుకున్న లక్ష్యం కంటే కూడా అధిక మొత్తంలోనే పెట్టుబడులను రాబట్టింది.

దావోస్ సదస్సుల్లో చివరి రోజు అయిన గురువారం నాటి భేటీలు ముగిసే సమయానికి తెలంగాణ సర్కారు మొత్తంగా 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ పెట్టుబడులతో ఏర్పాటు కానున్న పరిశ్రమల ద్వారా రాష్ట్రంలోని యువతకు ఏకంగా 49,500 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతానికి పేపర్లపైనే ఉన్న ఈ ఒప్పందాలన్నీ కార్యరూపం దాల్చితే… రాష్ట్రానికి భారీ లబ్ధి చేకూరినట్టే.

ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు జరిగి అప్పుడే 11 ఏళ్లు కావస్తోంది. గతంలో బీఆర్ఎస్ పాలనలోనూ తెలంగాణ ప్రతినిధి బృందాలు దావోస్ సదస్సుకు వెళ్లాయి. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులను తీసుకువచ్చాయి. అయితే ఈ ఏడాది రేవంత్ బృందం సాధించినంత స్థాయి పెట్టుబడులు గతంలో రాలేదు. ఇక గతేడాది వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే… ఈ ఏడాది కుదిరిన ఒప్పందాల విలువ ఏకంగా నాలుగు రెట్లు అధికమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇక ఈ దఫా దావోస్ లో తెలంగాణ సర్కారుతో ఆయా సంస్థలు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాల్లోకి వెళితే… అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏకంగా రూ.60 వేల కోట్లతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. జాబితాలో ఇదే అతి పెద్ద పెట్టుబడి. ఇక రెండో స్థానం సన్ పెట్రో కెమికల్స్ కు దక్కుతుంది. ఈ సంస్థ తెలంగాణలో రూ.45,500 కోట్లతో సోలార్, పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. రూ.15 వేల కోట్లతో లగ్జరీ వెల్ నెస్ కేంద్రాలు, పవర్ ప్రాజెక్టులను మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనుంది. కంట్రోల్ ఎస్ అనే సంస్థ ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు కోసం రూ.10 వేల కోట్లను వెచ్చించనుంది. ఇక మిగిలినవన్నీ చిన్న పెట్టుబడులే అయినప్పటికీ… తెలంగాణ సత్తా చాటిందని చెప్పక తప్పదు

This post was last modified on January 23, 2025 10:58 pm

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

23 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

35 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

52 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

1 hour ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

1 hour ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago