టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి; ఏపీ మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎంగా పదోన్నతి కల్పించాలంటూ మొన్నటిదాకా టీడీపీ శ్రేణులతో పాటు పార్టీకి చెందిన కీలక నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై కొన్నాళ్ల పాటు అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరించినా… ఆ తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొత్తు ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదా? అంటూ ఉరిమింది. ఇకపై ఆ తరహా డిమాండ్లు చేస్తే చర్యలు తప్పవని ఒకింత గట్టిగానే చెప్పింది. ఫలితంగా సైలెన్స్ రాజ్యమేలుతోంది.
అయితే సరిగ్గా లోకేశ్ జన్మదినమైన గురువారం పార్టీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు… లోకేశ్ పదోన్నతిని ప్రస్తావించారు. లోకేశ్ బర్త్ డేను పురస్కరించుకుని విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ భరత్ తో కలిసి భారీ కేక్ ను కట్ చేసిన అచ్చెన్న… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా… చంద్రబాబు తర్వాత ఎవరు అంటే.. లోకేశేనని చెబుతానని అన్నారు. ఈ మాటను తానే కాదు రాష్ట్రంలో ఏ చిన్న పిల్లాడిని అడిగినా ఇదే సమాధానం చెబుతారని కూడా ఆయన అన్నారు. లోకేశ్ తమ భవిష్యత్తు నేత అని అచ్చెన్న ఒకింత గట్టిగానే చెప్పారు.
అధిష్ఠానాన్ని ధిక్కరించి లోకేశే తమ భావి నేత అని చెప్పిన అచ్చెన్న.. తన వ్యాఖ్యలను భలే బ్యాలెన్స్ చేసుకున్నారు. గతంలో పార్టీ ఏపీ విభాగానికి అధ్యక్షుడిగా కూడా అచ్చెన్న పనిచేశారు కదా. ఆ అనుభవంతో అచ్చెన్న తన వ్యాఖ్యలను ఏ ఒక్కరూ తప్పువట్టకుండా ఉండేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. లోకేశే తమ భవిష్యత్తు నేత అయినా… పొత్తు ధర్మాన్ని పాటించి… కూటమి పార్టీల్లోని ముఖ్య నేతలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన తెలిపారు. తాను కూడా కూటమి నేతల మాటలకు కట్టుబడి ఉంటానని కూడా అచ్చెన్న చెప్పేసి… తన వ్యాఖ్యలను ఆధారం చేసుకుని మరొకరు లోకేశ్ కు డిప్యూటీ డిమాండ్లు చేయకుండా జాగ్రత్త పడ్డారు.
This post was last modified on January 23, 2025 5:28 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…