టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలకు కాస్తంత గ్యాప్ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులకు మంచి మాస్ మసాలాతో అలరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అఖండ సీక్వెల్ కోసమూ రెడీ అయిపోతున్న బాలయ్య,.. కాస్తంత గ్యాప్ దొరకబుచ్చుకుని తన సొంత నియోజకవర్గం హిందూపురం వచ్చారు. మంగళవారం ఉదయానికే హిందూపురం చేరిన ఆయన బుధవారం రెండో రోజు కూడా నియోజకవర్గంలో పర్యటించారు.ఈ సందర్భంగా హిందూపురం అభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న సహకారం వంటి అంశాలపై తనదైన స్టైల్లో ప్రసంగించారు.
బుధవారం ఉదయం హిందూపురంలో పర్యటిస్తున్న సందర్బంగా మీడియా ప్రతినిధులు కనిపించగా.. వారికి బాలయ్య కాసేపు సమయాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇటీవలే కేంద్రం రూ.12 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడం పట్ల ఆయన హర్షం ప్రకటించారు. అంతేకాకుండా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్.. ఇలా అన్ని అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం తనవంతు సహకారం అందిస్తోందని, ఇందుకు కేంద్రానికి తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.
అనంతరం హిందూపురం అభివృద్ధి గురించి మీడియా ప్రశ్నించగా… హిందూపురంలో రోడ్ల అభివృద్ధికి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూ.92 కోట్లు విడుదల చేసిందన్నారు. ఆ పనులు జరుగుతున్నాయన్నారు. ఇక హంద్రీనీవా మరమ్మతుల కోసం కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, వాటి పనులూ సాగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలో కీలక ప్రాజెక్టు అయిన చిలమత్తూరు గోరంట్ల ఎత్తిపోతల పథకాన్ని ఈ దఫా ఎలాగైనా పూర్తి చేస్తామని బాలయ్య చెప్పారు.
ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు పట్ల గత వైసీపీ సర్కారు వ్యవహరించిన తీరుపై బాలయ్య అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును రూ.500 కోట్లతో ప్రతిపాదించామని ఆయన చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కనపెట్టేసిందన్నారు. ఫలితంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోసం రూ.850 కోట్లను వెచ్చించాల్సి వస్తోందన్నారు. థరలు పెరిగిన కారణంగా ప్రాజెక్టు వ్యయం పెరిగిందన్నారు. ఏది ఏమైనా హిందూపురం సర్వతోముఖాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బాలయ్య చెప్పుకొచ్చారు. అధికారులు కూడా తమ వంతు సహకారం అందించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on January 22, 2025 3:50 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…