అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడికి చేరాయి. అందులో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉన్నాయి. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల వారూ అక్కడికి వచ్చారు. నాలుగు రోజులు మాత్రమే జరిగే ఈ సమావేశాల్లో ఒక్కో క్షణం ఎంత విలువైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటప్పుడు ట్రాఫిక్ జాం అయితే…గుండెలు గుబగుబలాడటం ఖాయమే. ఆ ప్రమాదం వద్దనుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్… ఆ ట్రాఫిక్ చిక్కులను తప్పించుకునేందుకు ఏకంగా కాలి నడకకు శ్రీకారం చుట్టారు.
దావోస్ లో బుధవారం నాటి సమావేశాలకు బయలుదేరే సందర్భంగా నారా లోకేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఇద్దరు యువ అధికారులతో కలిసి లోకేశ్… వణికించే చలిలో చకచకా నడుస్తూ సాగిపోతున్నారు. లోకేశ్ నడుస్తూ సాగుతుంటే… ఆయనను వెంబడించేందుకు ఓ అధికారి నడకను కాస్తా పరుగుగా మార్చాల్సి వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇవేవీ గమనించని ఎంచక్కా జేబుల్లో చేతులు పెట్టేసుకుని లోకేశ్ చకచకా సాగిపోయారు.
అయినా దావోస్ లా లోకేశ్ కాలి నడకన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయానికి వస్తే… దావోస్ సదస్సుకు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధి బృందాలు హాజరయ్యాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతోందట. ఇక సమావేశాలు ప్రారంభమయ్యే సమయంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందట. ఈ ట్రాఫిక్ చిక్కులు ఎందుకు అని లోకేశ్ భావించినట్లున్నారు. అందుకే కాలి నడకన లెఫ్ట్ రైైట్ అంటూ సాగిపోయినట్లున్నారు.
ఇన్వెస్టర్లతో మీటింగ్ కు ఆలస్యం కావద్దు కదా. అందుకే… ముందు చూపుగా అలా కాలి నడకరన ఆయన చకచకా వెళ్లిపోయారు. ఇటీవలి అమెరికా పర్యటనలోనూ లోకేశ్ ఇలాగే కాలి నడకక సాగిపోయిన వీడియో సోషల్ లో వైరల్ గా మారిపోయింది. తాజాగా దావోస్ లోనూ ఆయన కాలి నడకన… అది కూడా గడ్డ కట్టే చలిలోనూ అలా కాలి నడకన సాగిపోతున్న వీడియో ఇట్టే వైరల్ గా మారిపోయింది.
This post was last modified on January 23, 2025 9:31 am
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…