తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని.. ఏపీలో మాదిరిగా ఈసారి వచ్చే తెలంగాణ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని.. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు చెప్పి.. దాదాపు ఆరు మాసాలు దాటి పోయింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. రెండో వారంలోనే ఆయన తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ శ్రేణుల్లో భరోసా నింపారు. అయితే.. ఆరు మాసాలు గడిచినా.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మరోవైపు.. ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. పార్టీకి ఇంకా.. అధ్యక్షుడిని నియమించలేదు. నాయకులు లేక కాదు.. కానీ, అంతకన్నా బలమైన నాయకుడి కోసం చంద్రబాబు అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఈ విషయంపై తాత్సారం జరుగుతోందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇదిలావుంటే.. వచ్చే తెలంగాణ ఎన్నికల నాటికి చాలా పెద్ద వ్యూహంతోనే చంద్రబాబు అడుగులు వేస్తున్నారని తాజా సమాచారం. కీలక పార్టీగా ఉన్న బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలను చేర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ టీడీపీకి నాయకులు ఉన్నారు. అయితే.. వీరిని మించి ప్రజలను ఆకర్షించే నాయకుల కోసం పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. ఈ క్రమంలోనే బీఆర్ ఎస్ కు గతంలో వెళ్లిపోయిన తమ్ముళ్లను తిరిగి రావాలంటూ పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్టు తెలిసింది. ఇటీవల అన్నగారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు వెళ్లారు. ఈ సమయంలోనే దీనికి సంబంధించిన ప్రణాళికను పార్టీ ముఖ్యులకు ఆయన అందించారని విశ్వసనీ వర్గాలు తెలిపాయి. తద్వారా.. ఘర్‌వాపసీ మంత్రానికి శ్రీకారం చుట్టారు.
ఇక్కడ రెండు రకాలుగా టీడీపీ అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 1) తాము సొంత గా ఎదడగం. 2) బీఆర్ ఎస్‌ను అన్ని వైపుల నుంచి కట్టడి చేయడం. ఈ రెండు వ్యూహాలకు పదును పెంచ డం ద్వారా తెలంగాణపై పట్టు బిగించే దిశగా తెలుగు దేశం అడుగులు పడుతున్నాయి. వీటిలో ఏది ముం దు జరుగుతుందనే విషయాన్ని పరిశీలిస్తే.. బీఆర్ ఎస్ నుంచి నాయకులను వెనక్కి తీసుకోవడమే ముందు జరుగుతుందని సమాచారం. కీలక నేతలుగా ఉన్న వారిని ఆహ్వానించడం, పార్టీ పగ్గాలను ముఖ్య నేతకు అప్పగించడం ద్వారా ఉభయ కుశలోపరి అన్న విధంగా.. టీడీపీ వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 21, 2025 4:04 pm
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……
టాలీవుడ్ నిర్మాతల ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ జరగడం కొత్తేమీ కాదు. ఒక నిర్మాణ సంస్థకు పెద్ద సక్సెస్ వచ్చినపుడు…
నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఒక విషయంలో సారూప్యత కొనసాగించడం అభిమానుల ఎదురుచూపులను పెంచుతోంది. అదేంటో చూద్దాం.…