ఏపీ సీఎం చంద్రబాబు నోటి నుంచి ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. మరో జన్మ అంటూ ఉంటే.. మళ్లీ తెలుగు వాడిగానే పుట్టాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం బృందం.. తొలుత జ్యురిచ్‌లో జరిగిన పారిశ్రామిక వేత్తల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలుగు వారు అన్ని దేశాల్లో నూ ఉన్నారని వారి ప్రతిభా పాటవాలతో తమదైన గుర్తింపు తీసుకువస్తున్నారని చెప్పారు. ప్రతి విషయంలోనూ ఎంతో నైపుణ్యంతో వ్యవహరిస్తున్నారని.. తద్వారా దేశానికి రాష్ట్రానికి కూడా పేరు తెస్తున్నట్టు చెప్పారు.
తెలుగు వారు చాలా మేధావులు, నైపుణ్యం ఉన్నవారని పేర్కొన్న చంద్రబాబు.. దాదాపు అన్ని దేశాల్లోనూ వారి జాడ కనిపిస్తుందని చెప్పారు. తన కోసం.. గత ఏడాది ఎన్నికలకు ముందు.. అదేవిధంగా తనను జైల్లో అక్రమంగా నిర్బంధించినప్పుడు కూడా.. తనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అండగా నిలిచారని పేర్కొన్నారు. అందుకే.. తనకు తెలుగు నేల అన్నా.. తెలుగు వారన్నా అభిమానమని పేర్కొన్నారు. మళ్లీ జన్మ అంటూ.. తెలుగు వాడిగానే తాను పుట్టాలనికోరుకుంటున్నట్టు చెప్పారు. అదేవిధంగా యువతకు మంచి భవిష్యత్తు ఉందని.. పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని అభిలషిస్తున్నానని సీఎం తెలిపారు.
హైదరాబాద్ అందుకే గొప్పది!
తెలంగాణకు హైదరాబాద్ కల్పవృక్షం వంటిదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ఎప్పుడో చెప్పానన్నారు. అక్కడ తలసరి ఆదాయం కూడా ఎక్కువగానే ఉందని.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు హైదరాబాద్ కీలక ఆర్థిక వనరుగా మారిందన్నారు. తాను ప్రోత్సహించిన ఐటీ రంగం ఇప్పుడు తెలంగాణకు ఆర్థికంగా ఎంతో మేలు చేస్తోందన్నారు. ఒకప్పుడు ఐటీని ప్రోత్సహిస్తే.. అనేక మంది విమర్శలు చేశారని చెప్పారు. కానీ, తాను ముందుకే సాగానని, దీంతో హైదరాబాద్‌కు ఇప్పుడు ఆర్థికంగా ఎంతో ఊతం లభించినట్టు అయిందన్నారు.
యువతులకు పెద్దపీట..
ప్రపంచ వ్యాప్తంగా యువతుల సంఖ్య, వారి నైపుణ్యాలు పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ముఖ్యంగా ఐటీ రంగం లో యువతులకు ప్రాధాన్యం లభిస్తోందన్నారు. యువకుల కంటే కూడా.. యువతుల ఆదాయం మెండుగా ఉందన్నారు. అందుకే.. వారిని అన్ని రంగాల్లోనూ తాను ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు సీఎం చెప్పారు. తద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేయనున్నట్టు తెలిపారు. కాగా.. జ్యూరిచ్‌లో పర్యటన అనంతరం.. దావోస్‌కు వెళ్లనున్నారు.
This post was last modified on January 20, 2025 8:34 pm
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరిగే దావోస్ వేదిక… ఎటు చూసిన రిచ్ లుక్ తో కనిపిస్తుంది. అక్కడ ఓ…
మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తోంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తరు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… ఎలా కనిపిస్తారు? గతంలో అయితే అప్పుడప్పుడూ లైట్ కలర్…
కొత్త ఏడాది మొదలయ్యాక సినీ ప్రియులందరి దృష్టి సంక్రాంతి చిత్రాల మీదే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ సీజన్లో భారీ…
స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు..మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడు,…
సంక్రాంతికి వస్తున్నాం లాంటి మిడ్ రేంజ్ సినిమా వారం రోజులుగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరు చూసి ట్రేడ్ పండిట్లు…