ప్రభుత్వం తరఫున పనులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెలలు సంవత్సరాల సమయం కూడా పడుతుంది. అనేక మంది అధికారుల పరిశీలన, అనేక శాఖలతో ముడిపడిన వ్యవహారాలకు అనుమ తులు.. వంటివి ప్రధానంగా సమయాన్నిమింగేస్తాయి. అందుకే ఒక్కొక్క సారి సాక్షత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు చెప్పినా.. ఆయా పనులు ఏళ్ల తరబడి ఆలస్యమైన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు ఈ సమయాభావాన్ని తగ్గించేస్తున్నారు.
మంత్రులు.. ముఖ్యమంత్రిగా తాను ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేసేలా యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. ఒక విధంగా జవాబుదారీ తనానికి పెద్దపీట వేస్తున్నారు. దీంతో సీఎం అయినా.. డిప్యూటీ సీఎం అయినా.. ఏదైనా విషయంపై అలా చెప్పగానే.. సంబంధిత అధికారులు ఇలా చేస్తున్నారు. పెద్దగా సమయం తీసుకోకుండానే 24 గంటల్లోనే సాధ్యమైనంత వరకు పనులు చేస్తున్నారు. తాజాగా శనివారం(18వ తేదీ) చంద్రబాబు ఇచ్చిన హామీని ఆదివారం సాయంత్రానికి అధికారులు నెరవేర్చారు.
ఏం జరిగింది?
శనివారం కడప జిల్లా మైదుకూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ‘స్వర్ణ ఆంధ్రా, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో భాగంగా.. స్వచ్ఛత దివస్ కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో స్థానిక వినాయకనగర్ కు చెందిన వేల్తుర్ల విష్ణు వందన నివాసాన్ని సందర్శించారు. చెత్త ద్వారా సంపదను సృష్టించవచ్చన్న ప్రభుత్వ సూచనలను ఈ కుటుంబం పాటించడాన్ని చూసి చంద్రబాబు ఆశ్చర్యపోయారు. ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన గృహిణి విష్ణు వందనను అభినందించారు.
ఈ సందర్భంగా వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. వందన కుటుంబ జీవనం మెరుగుపడేందుకు ప్రభుత్వ సాయం కోరుతూ ఆమె వినతి పత్రాలు అందించారు. వీటిని పరిశీలించిన సీఎం తక్షణం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు. దీంతో 24 గంటలలోపే ఈ కుటుంబానికి ప్రభుత్వం నుంచి అన్ని పనులు అయ్యాయి. ఈ కుటుంబానికి సంబంధించి మొత్తం పలు వినతులు అందగా.. రెండింటిని వెంటనే పరిష్కరించారు.
కుటుంబలోని ఒకరికి వృద్దాప్య పెన్షన్ మంజూరు చేశారు. ఉపాధి కోసం ఆర్థిక సాయం అందించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విష్ణు వందనకు డీఆర్డీఏలో ఔట్ సోర్సింగ్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగ అవకాశం కల్పించారు. మొత్తానికి సీఎం చంద్రబాబు అలా హామీ ఇవ్వగానే అధికారులు ఇలా పూర్తి చేయడంపై విష్ణు వందన కుటుంబం హ్యాపీగా ఫీలవడం గమనార్హం.
This post was last modified on January 20, 2025 2:49 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…