Political News

సింగపూర్ లో షికారు కొడుతున్న రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

సింగపూర్ సిటీ మధ్యలో ఉన్న నదిలో బోటు షికారుకు రేవంత్ వెళ్లారు. ఈ సందర్బంగా బోటులో నిలుచుని… నదిలో నుంచి తనకు కనిపిస్తున్న భవంతులను చూస్తూ ఆయన పారవశ్యం పొందారు. అయితే అదేదో జల్సా షికారు అయితే కాదు. ఎందుకంటే… సింగపూర్ రివర్ లో బోటు షికారుకు వెళ్లిన రేవంత్… తన వెంట సింగపూర్ అధికారిని కూడా తీసుకుని వెళ్లారు. నదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… నదిని వారు కాపాడుకుంటున్న తీరు గురించి ఆసక్తిగా విన్నారు.

అలా సింగపూర్ రివర్లో జాలీగా షికారు కొడుతున్న వీడియోను స్వయంగా రేవంతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ బోటు షికారులో తాను ఏం గమనించానన్న విషయాన్ని కూడా సదరు పోస్టులో రాసుకొచ్చారు. సింగపూర్ సర్కారు నదిని పునరుద్ధరించిన తీరు, ఆపై దానిని కాపాడుకుంటున్న తీరు… అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నట్లు వివరించారు. ఆ చర్యలను హైదరాబాద్ కూ అప్లై చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక బోటు షికారుకు వెళ్లిన సందర్భంగా కలర్ షర్ట్ వేసిన రేవంత్… ఓ సీఎంగా, రాజకీయ నేతగా కాకుండా.. సింగపూర్ ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ గానే కనిపించారు.

This post was last modified on January 20, 2025 2:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ఎయిర్ బస్’ రూటు మనవైపు తిరిగేనా?

దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…

4 hours ago

మ‌హా కుంభ మేళాలో అగ్ని ప్ర‌మాదం.. ఎవ‌రిది త‌ప్పు?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని త్రివేణీ సంగ‌మం(గంగ‌, య‌మున, స‌రస్వ‌తి న‌దులు సంగ‌మించే చోటు)లో ఈ నెల 13 నుంచి నిర్వ‌హిస్తున్న మ‌హా కుంభ‌మేళాకు…

6 hours ago

ఏపీకి ‘ట్రిపుల్’ భరోసా దక్కింది!

తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన వైనం… ఏపీని పెను కష్టాల్లో పడేసింది. వచ్చే ఆదాయంతా తెలంగాణకు వెళ్లగా… ఆదాయ…

8 hours ago

అట్టహాసంగా ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు

సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…

8 hours ago

అమిత్ షాను చూస్తే నాకు అసూయ: చంద్రబాబు

ఏమిటేమిటీ….? టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నోట నుంచి ఇంత మాట వినిపించిందా? బీజేపీలో అగ్ర నేతగా,…

10 hours ago

లోకేశ్ కు డిప్యూటీ ఇచ్చి తీరాల్సిందేనా..?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ కు ప్రమోషన్ ఇవ్వాలంటూ ఇటీవలి కాలంలో టీడీపీలో…

11 hours ago