తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆయా పార్టీలకు అనివార్యంగా మారిపోయిందని కూడా చెప్పక తప్పదు. సరే.. అదెలాగూ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ పత్రికా పఠనంపై ఆసక్తి కలిగిన వారికి ఈ ఉదయం భారీ షాకే తగిలి ఉంటుంది. ఎందుకంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షిపత్రికలో శనివారం టీడీపీ యాడ్ కనిపించింది. అది కూడా ఏదో లోపలి పేజిల్లో కాదు… ఎంచక్కా… ఫస్ట్ పేజీ… ఫుల్ పేజీ యాడ్ టీడీపీదే. వెరసి సాక్షి పత్రిక టీడీపీ పక్షాన చేరిపోయిందా? అన్న సెటైర్లు పడ్డాయి.
అయితే ఈ షాకింగ్ భాగ్యం… ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు కలగలేదులెంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులకు ఈ షాకింగ్ భాగ్యం దక్కింది. ఈ జిల్లాలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లాలోని కొవూరు శాసనసభ్యురాలిగా ఉన్న ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు రాజకీయంగా కీలకంగా వ్యవరిస్తున్నారు. వీరే శనివారం నాటి సాక్షి సంచికలో టీడీపీ యాడ్ ను వేయించారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆ దంపతులు ఈ యాడ్ ను సాక్షికి విడుదల చేశారు. నెల్లూరు జిల్లా ఎడిషన్ వరకు మాత్రమే ఈ యాడ్ ప్రచురితమైంది.
సాధారణంగా ఈ తరహా యాడ్ లను సాక్షి తీసుకోదు అని చాలా మంది అనుకుంటారు. ఓ పత్రికగా తన వద్దకు వచ్చిన ప్రకటనకర్తల సమాచారాన్ని, యాడ్ లను సాక్షి ప్రచురించడంలో తప్పేమీ లేదు. తన వద్దకు వచ్చిన ఓ యాడ్ ను తిరస్కరించడం…ఆయా పత్రికల హక్కు అయినప్పటికీ… చట్టవిరుద్ధమైన వ్యవహారాలు మినహా మిగిలిన వాటి యాడ్ లను తిరస్కరించడం పత్రికా ధర్మం అనిపించుకోదు కూడా. ఈ అంచనాలు అన్నీ వేసుకున్న మీదటే సాక్షి ఈ యాడ్ ను స్వీకరించి ఉంటుంది.
ఇక వేమిరెడ్డి దంపతులు జారీ చేసిన ఈ యాడ్…టీడీపీ ప్రాభవాన్ని ఓ రేంజిలో చూపిస్తోంది. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని టీడీపీ కేంద్ర కార్యాలయం రూపొందించిన యాడ్ నమూనాను వేమిరెడ్డి దంపతులు వాడుకున్నారు యాడ్ లో మధ్యలో ఎన్టీఆర్ తేజస్సుతో వెలిగిపోతుండగా… ఆయనకు ఓ వైపున సీఎం నారా చంద్రబాబునాయుడు, మరో వైపున మంత్రి నారా లోకేశ్ ఫొటోలు ఉన్నాయి. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కాగా… టీడీపీ సభ్యత్వం కోటి మార్కును దాటిందని, దానితో ఈ ఏడాది ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నామని చెబుతూ వేమిరెడ్డి దంపతులు ఈ యాడ్ ను జారీ చేశారు.
సాక్షిపేపర్ లో ఇలా ఓ జిల్లాకు చెందిన మెయిన్ ఎడిషన్ లో టీడీపీకి చెందిన యాడ్… ఫుల్ పేజీలో కనిపించిన వైనంపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ యాడ్ ను ముద్రించి సాక్షి తన స్థాయిని దిగజార్చుకుందని, ఎవరైనా తమ కిందకు రావాల్సిందేనన్న రీతిలో టీడీపీ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో తప్పేముంది… గతంలో ఈనాడులో వైసీపీ యాడ్లు రాలేదా? అంటూ వైసీపీ యాక్టివిస్టులు సమాధానమిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది.
This post was last modified on January 18, 2025 10:20 pm
యాదృచ్చికమో లేక కాకతాళీయమో చెప్పలేం కానీ హీరో రామ్ చరణ్, నిర్మాత దిల్ రాజు మధ్య కాంబో రెండుసార్లు ఒడిదుడుకులకు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ…
ఇప్పుడంతా టాలీవుడ్ లో సంక్రాంతి హడావిడి నడుస్తోంది. హిట్ టాక్ తో రెండు దూసుకుపోతున్నా బాక్సాఫీస్ డామినేషన్ మాత్రం పూర్తిగా…
నిన్న డాకు మహారాజ్ సక్సెస్ మీట్ లో తమన్ బాగా ఎమోషనల్ అయిపోతూ సినిమాను చంపొద్దంటూ, సోషల్ మీడియాలో మరీ…
ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో కీలక విభాగం అయిన సీఐడీకి చీఫ్…
పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.…