Political News

మంత్రి అయినా.. మూలాలు మ‌ర‌వ‌లేదు!

ఆయ‌న ఏపీ మంత్రి. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ‌కు అమాత్యుడిగా ప‌నిచేస్తున్నారు. రాజ‌కీయంగా వివాద ర‌హి తుడు. ఆర్థికంగా ఎలాంటి వివాదాల‌కు తావులేకుండా ముందుకు సాగుతున్నారు. ఇక‌, మంత్రిగా ఆయ‌న చుట్టూ అంగ ర‌క్ష‌కులు, సిబ్బంది, ప్రొటోకాల్‌కు కొద‌వేలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ద‌గ్గ‌రా ఆయ‌న‌కు చ‌నువు ఉంది. పార్టీలోనూ కీల‌క నాయ‌కుడు. ఆయ‌న ఎక్క‌డ కూర్చున్నా.. ఏం చేస్తున్నా ఎవ‌రూ.. అడ‌గ‌రు. ఎందుకంటే ఆయ‌న ప‌డాల్సిన క‌ష్టం ఎప్పుడో ప‌డ్డారు. గ‌త ఐదేళ్లు కూడా పార్టీ కోసం ప‌నిచేశారు.

ఇదే ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని అప్ప‌గించింది. అయితే.. ఆయ‌న తిని కూర్చోవ‌డం లేదు. ప్రొటోకాల్ గౌర‌వాల‌ను కూడా సొంతం చేసుకోవ‌డం లేదు. ఆసాంతం.. త‌న‌ను తాను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. త‌న మూలాల‌ను త‌డుముకుని చూసుకుంటూనే ఉన్నారు. మ‌ట్టి మ‌నిషిగా మారి.. త‌న సాగును తానే బాగు చేసుకుంటున్నారు. ఆయ‌నే అప్ర‌తిహ‌త విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. పాల‌కొల్లు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఆయ‌న‌.. తాజాగా మీడియాలో మ‌రోసారిమెరిసారు.

దీనికి కార‌ణం.. కనుమ పండుగ రోజు పొలం పనుల్లో నిమగ్నం కావ‌డ‌మే. సొంత పొలంలో ఆయ‌న వీపున‌కు పురుగుల‌ మందు బ‌కెట్‌ను క‌ట్టుకుని.. చేతిలో గ‌న్ ప‌ట్టుకుని పొలానికి మందు పిచికారీ చేశారు. కనుమ పండగ నాడు సొంతూరైన ఏలూరు జిల్లా ఆగర్తిపాలెంలో పర్యటించారు. ఈ క్రమంలో నిమ్మల తన పొలానికి వెళ్లి వరి చేనుకు పురుగుల మందు పిచికారీ చేశారు. దీనికి సంబంధించిన పలు వీడియాలు, ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఈ సంద‌ర్భంగా మంత్రి నాయుడు మాట్లాడుతూ.. త‌న ప‌నిని తాను చేసుకోవ‌డంలో ఎంతో ఆనందం ఉంద‌న్నారు. రైతుల‌కు మేలు చేసేలా కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. న‌ష్టం లేని సాగును ప్రోత్స‌హించ‌డ‌మే కూట‌మి స‌ర్కారు ఉద్దేశ‌మ‌న్నారు. రైతులు అమ్మిన ధాన్యానికి 48 గంట‌ల్లోనే సొమ్ములు చేతికి అందాయ‌ని.. ఇలా జ‌ర‌గ‌డం ఏపీలో ఐదేళ్ల త‌ర్వాత ఇదే తొలిసారి – అనివ్యాఖ్యానించారు. భ‌విష్య‌త్తులోనూ అన్న‌దాత‌ల‌కు అండ‌గా అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు.

This post was last modified on January 17, 2025 11:02 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీరమల్లు పాట : 5 భాషల్లోనూ పవన్ గాత్రం!

https://youtu.be/y4Rp45vN2O0?si=TR5xlCj2RZGr5bpe సుదీర్ఘ కాలంగా నిర్మాణంలో ఉన్న హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ నుంచి మొదటి ఆడియో…

1 minute ago

కూట‌మి స‌ర్కారుపై వ్య‌తిరేక‌త లేదు.. కానీ ..!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఏడు మాసాలు అయిపోయింది. జ‌న‌వ‌రి 12వ తేదీకి కూట‌మి స‌ర్కారుకు ఏడు మాసాలు నిండాయి.…

15 minutes ago

వైసీపీ క‌న్నా ముందే ప్ర‌జ‌ల్లోకి టీడీపీ.. స‌రికొత్త స్ట్రాట‌జీ.. !

వైసీపీ క‌న్నా ముందుగానే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు.. ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించేందుకు కూట‌మి పార్టీల్లో కీల‌క‌మైన టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంది. దీనికి…

37 minutes ago

కేరళలో జీవ సమాధి.. తవ్వి చూడగానే..

తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవ సమాధి చేసుకున్నారనే వార్తలు కలకలం రేపాయి. అతడి కుటుంబ సభ్యుల ప్రకటనతో…

1 hour ago

లక్షలాది అఘోరాల మధ్య అఖండ 2 తాండవం

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవం మొదలుపెట్టిన దర్శకుడు బోయపాటి శీను…

14 hours ago

పుష్ప నచ్చనివాళ్ళకు గాంధీ తాత చెట్టు

రాజమౌళి రికార్డులని దాటేసే స్థాయిలో పుష్ప 2 ది రూల్ తో ఆల్ టైం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సృష్టించిన…

14 hours ago