సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం.. కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తినే పండుగ కూడా సంక్రాంతే. ఇక, కల వారి విషయానికి వస్తే.. 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా.. బట్టలు కొనుగోలు చేసి ధరించే పండుగ కూడా! కానీ, మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన సతీమణికి చేనేత చీరను కొనుగోలు చేసి కానుకగా ఇచ్చారు. దీని ఖరీదు 1300 లుగా పేర్కొన్నారు.
నిజానికిఇంత తక్కువ ఖరీదు దుస్తులు కట్టుకునే పరిస్థితిలో అయితే.. నారా కుటుంబం లేదు కదా! కానీ.. నారా లోకేష్ మాత్రం అంతే ఖరీదు పెట్టి ఆమెకు చీరను కొనుగోలు చేసి ఇచ్చారు. దీనికి కారణంగా.. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో చేనేతకు పెట్టింది పేరు. ఇక్కడ నేసే చీరలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే.. ప్రభుత్వాల నుంచిసరైన సహకారం తమకు లభించడం లేదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ గెలిచిన తర్వాత నుంచిఇక్కడి వస్త్రాలను కార్మికులను కూడా ప్రోత్సహిస్తున్నారు.
దీనిలో భాగంగానే తరచుగా చేనేతలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్‌లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక, అవకాశం ఉన్న ప్రతిసారీ.. తన కుటుంబానికి ఇక్కడి వారి చీరలను, దుస్తులనే కొనుగోలు చేస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని నారా బ్రాహ్మణికి రూ.1300 విలువ చేసే చేనేతను స్వయంగా కొనగోలు చేసి.. కానుకగా అందించారు. ఇది విలువ తక్కువ కాదని.. నైపుణ్యం ఎక్కువగా ఉన్న చీరని నారా లోకేష్ పేర్కొన్నారు.
బంగారు, తెలుగు వర్ణం మిక్సింగ్‌తో రూపొందించిన ఈ చీర అద్భుతంగా ఉందని బ్రాహ్మణి మురిసిపోయారు. ఇక, నారా లోకేష్ కూడా ఇక్కడ వారు నేసిన వస్త్రాలతో నే తనకు, తన కుమారుడికి కూడా దుస్తులు కుట్టించుకున్నారు. మొత్తానికి చేనేతకు అప్పకటిత బ్రాండ్ అంబాసిడర్‌గా నారా లోకేష్ మారారని కార్మికులు చెబుతున్నారు.
This post was last modified on January 15, 2025 1:04 pm
తెలుగు సినీ పరిశ్రమ ఈ రోజు హైదరాబాద్‌లో ఎంత పెద్ద స్థాయిలో నిలబడుతోందో తెలిసిందే. ఇండియాలోనే అతి పెద్ద ఇండస్ట్రీల్లో…
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెర్ఫార్మన్స్ పరంగా వెంకటేష్ తర్వాత ఎక్కువ స్కోప్ దొరికింది ఐశ్యర్య రాజేష్ కే. గ్లామర్ పరంగా…
గత ఏడాది ‘కల్కి: 2898 ఏడీ’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు అతి…
ఎప్పుడో 2012లో మొదలైన తమిళ సినిమా.. మద గజ రాజా. కొన్ని కారణాల వల్ల మేకింగ్‌లో ఆలస్యం జరిగి.. 2013…
ఏపీ రాజధాని అమరావతి రైతులకు సీఎం చంద్రబాబు పండగ పూట భారీ కానుక అందించారు. గత ఏడాదిన్నరగా నిలిచి పోయిన…
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సంక్రాంతి వేళ భారీ ఎదురు దెబ్బ తగిలింది.…