Political News

ప‌వ‌న్ పార్ట్‌టైం కాదు.. ఫుల్ టైం లీడర్!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై గ‌తంలో వైసీపీ నాయ‌కులు చేసిన ఆరోప‌ణ‌లు ప‌టాపంచ‌లు అవుతున్నాయి. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ నేత‌లు తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఆయ‌న ఫుల్ టైమ్ పాలిటిక్స్ కోసం రాలేద‌ని.. పార్ట్‌టైమ్ పాలిటిక్స్ చేస్తాడ‌ని ఎన్నిక‌ల్లో ఆయ‌న మాట‌లు విని మోసపోవ‌ద్ద‌ని రోజా, కొడాలి నాని, పేర్ని నాని స‌హా.. ప‌లువురు నాయ‌కులు విమ‌ర్శలు గుప్పించారు. మ‌రికొంద‌రు సామాజిక వ‌ర్గం వారిగా కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు.

కాపుల ఓట్ల‌ను చంద్ర‌బాబు వ‌ద్ద తాక‌ట్టు పెట్టేందుకు రాజ‌కీయాలు చేస్తున్నారంటూ..ప‌వ‌న్‌పై విరుచుకు ప‌డ్డారు. ఇక‌, కాపు నాయ‌కులు, వైసీపీ సానుభూతిప‌రులుగా ఉన్న వారు అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు పొత్తుల‌పైనా విషాన్ని చిమ్మార‌ని జ‌న‌సేన నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. సీఎం పోస్టు ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టాల‌ని, మొత్తం 175 సీట్ల‌లో 50కిపైగా సీట్ల‌లో జ‌న‌సేన పోటీ చేయాల‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం, హ‌రిరామ‌జోగ‌య్య వంటివారు.. లేఖ‌లు సంధించారు.

క‌ట్ చేస్తే.. ప‌వ‌న్ వారి ఒత్తిళ్ల‌కు లొంగ‌లేదు. వారు చేసిన విమ‌ర్శ‌ల‌ను కూడా ప‌ట్టించుకోలేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కూడ‌ద‌న్న ఏకైక అజెండాతో ముందుకు సాగారు. ప‌ట్టుబట్టి బీజేపీని పొత్తులోకి లాక్కొచ్చారు. ఇక‌, ఎన్నిక‌ల్లో విజ‌యం త‌ర్వాత‌.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను డిప్యూటీ సీఎం అయిన త‌ర్వాత‌.. స‌త్తా చూపిస్తున్నారు. ఎవ‌రైతే పార్ట్ టైమ్‌పొలిటీషియ‌న్ అని విమ‌ర్శ‌లు చేశారో.. వారి నోటికి తాళాలు వేశారు.

పాల‌న‌పై ప‌ట్టు సాగించ‌డ‌మే కాకుండా.. గ‌త ఆరు మాసాలుగా ఆయ‌న పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి కూడా అందుబాటులో ఉన్నారు. అంతేకాదు.. ఎక్క‌డ ఏం జ‌రిగినా వెంట‌నే స్పందిస్తున్నారు. జ‌న‌సేన నాయ‌కులు దారి త‌ప్ప‌కుండా కూడా మ‌రోవైపు కాచుకుంటున్నారు.

ప్ర‌భుత్వ‌ప‌రంగా అభివృద్ధి ప్రాధాన్య ప్రాజెక్టుల‌కు శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. మొత్తంగా ప‌వ‌న్ త‌న‌పై వ‌చ్చిన మ‌ర‌క‌ల‌ను తుడిచేసుకోవ‌డ‌మే కాదు.. తానేంట‌నేది నిరూపిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌కంగా మారార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on January 14, 2025 1:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

6 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

9 hours ago