తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే చెందిన పల్లె గంగా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన నేరుగా పలు పంచుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన వారే ఈ గంగా రెడ్డి. ఈ గ్రామంలోనే అత్యధిక సంఖ్యలో పసుపు రైతులు ఉన్నారు.
మరోవైపు నిజామాబాద్ ఎంపీ గా కొనసాగుతున్న బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన అరవింద్… తనను గెలిపిస్తే రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకుని వస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ హామీతోనే ఆ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ఆయన ఓడించారు. ఎన్నికల్లో గెలవగానే నిజామాబాద్ కు పసుపు బోర్డు ను తీసుకురావడానికి ఆయన తీవ్రంగానే కృషి చేశారు. అయితే 2024 ఎన్నికలదాకా అదుగో ఇదుగో అంటూ కేంద్రం సాగదీసింది. అయినా కూడా అరవింద్ ను నిజామాబాద్ ప్రజలు రెండోసారి కూడా ఎంపీ గా గెలిపించారు. దీంతో అరవింద్ ఒత్తిడితో కేంద్రం తాజాగా పసుపు బోర్డు ను ప్రారంభించేందుకు ఒప్పుకుంది.
This post was last modified on January 14, 2025 9:31 am
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగాక అభిమానుల్లో హీరోయిజం పిచ్చి ముదిరి పాకాన పడుతోంది. ఒకప్పుడు రిలీజ్ రోజు హడావిడితో…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ పగ్గాల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీ అధినే త కేసీఆర్…
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే నిజంగానే ప్రజలతో పటు ఉద్యోగులు కూడా ఫుల్ ఖుషీగా ఉంటారని…
ఏపీలో కూటమి సర్కారు అదికారంలో వచ్చి కేవలం ఆరు నెలలే అవుతోంది. అయితేనేం…విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తూ…
ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెల 19న స్విట్జర్లాండ్లోని దావోస్ కు వెళ్లనున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగే ప్రపంచ…
తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ…