“నువ్వు అక్రమాలు చేశావ్. అధికారంలో ఉండగా దోచుకున్నావ్. మాపై కేసులు పెట్టించి వేధించావ్. నీ అంతు చూస్తాం”- గత ఏడాది ఎన్నికలకు ముందు మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇవి.
“మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీలపైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్రభుత్వం.. వీరేం నాయకులు.. అందరూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రత్యర్థులపై టీడీపీ నేతలు చేసిన విమర్శలు ఇవి.
“గోదావరి జిల్లాల పరువు తీస్తున్నారు. శవాన్ని డోర్ డెలివరీ చేయడమా? ఇంత కన్నా ఘోరంఉంటుందా?. ఇలాంటి వారిని నడిరోడ్డుపై శిక్షించాలి” అప్పట్లో మార్మోగిన కీలక నేతల కంఠాలు.
‘పండగ సంబరాలు-సంస్కృతి’ పేరుతో పెద్ద పెద్ద బరులు గీసి.. పందేలకు రెడీ అయ్యారు. ఇక్కడ తరతమ బేధాలు లేవ్. పార్టీల రగడే అసలే ఉండదు. అంతా సౌభ్రాతృత్వం! రాజ్యాంగంలో పేర్కొన్న సోదరభావం.. కోడి పందేల బరుల్లో పక్కాగా విలసిల్లుతోంది. అన్ని కోస్తా జిల్లాల్లోనూ బరులు పంచుకునే దగ్గర నుంచి కోళ్లను కొనుగోలు చేసే వరకు.. పేకాట శిబిరాల నుంచి గుండాట వరకు వైసీపీ-టీడీపీ-జనసేన నాయకులతో పాటు కమల నాథుల్లో కొందరు ఉత్సాహవంతులు సైతం చేతులు కలిపారు.
అధికారులను తమ లైన్‌లోకి తెచ్చుకుని బరులు సిద్ధం చేసుకున్నారు. సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకు న్నారు. గిల్లికజ్జాలకు పోకుండా.. లాభాలు గిల్లుకునేందుకు రెడీ అయ్యారు. మైలవరం, తిరువూరు నుంచి నరసాపురం దాకా, గుంటూరులోని సత్తెనపల్లి (పల్నాడు ప్రాంతంలో కోళ్ల పందేలు ప్రశిద్ది) నుంచి మంగళగిరి వరకు అందరూ ఒకటే.. అందరి సంస్కృతి ఒక్కటే.
కలిసి మెలిసి పంచుకోవడం.. పందేలు వేసుకోవడం.. వచ్చిన లాభాలు పంచుకోవడం!! ఇలాంటి సంస్కృతి, సంప్రదాయాలు ఒక్క ఏపీలోనే కనిపిస్తుండడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ ఎస్, కాంగ్రెస్‌పార్టీ నాయకులు కూడా.. వైసీపీ, టీడీపీ, జనసేనలతో కలిసిపోయి.. పందేలకు రెడీ అయిపోవడం. వారికి ఇక్కడివారు అతిథి మర్యాదలు ఘనంగా చేయడం!!
This post was last modified on January 13, 2025 10:16 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించిన పరిస్థితి ఇటీవల కాలంలో ఎక్కడా లేదు. ఎప్పుడో ప్రమాణస్వీకార…
+ ``పండక్కి సెలవులు పెట్టారు. ఇప్పుడు ఎక్కడున్నారు. సరే.. ఎక్కడున్నా తక్షణమే వచ్చేయండి!`` + ``మీ సెలవులు రద్దు చేస్తున్నాం.…
ఇండియా క్రేజీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్న వార్ 2 విడుదల ఇంకో ఎనిమిది నెలల్లో జరగనుంది. ఆగస్ట్ 14…
దర్శకుడు త్రినాథరావు పేరు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తన కొత్త చిత్రం ‘మజాకా’…
అన్షు.. ఈ ముంబయి భామ తెలుగులో చేసింది రెండే రెండు సినిమాలు. అందులో రెండో సినిమా పెద్ద డిజాస్టర్. కానీ…
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా…