తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు… సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆపై గురువారం ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎవరి తప్పిదం వల్ల జరిగిందని కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇలా తోపులాటల్లో చనిపోవడమేమిటనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నా… భక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
అమరావతిలో సమీక్షా సమావేశాన్ని ముగించుకున్న వెంటనే హుటాహుటీన తిరుపతికి వెళ్లిపోయారు. తిరుపతిలో ల్యాండ్ అయిన వెంటనే చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం తోపులాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే చంద్రబాబు విశ్వరూపాన్ని చూసి అధికారులు వణికిపోయారు.
రోగుల పరామర్శకు ముందుగానే ఘటనా స్థలికి వెళ్లిన చంద్రబాబు…అక్కడే ప్రమాదం జరిగిన తీరుపై పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీటీడీ ఈవో, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు… ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ వారని నిలదీసినంత పనిచేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలుసు కదా… మరి ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా అంటూ చంద్రబాబు ఈవోను నిలదీశారు.
టీటీడీ తరఫున ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగని రీతిలోనే ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు చెప్పగా… మరి తోపులాట ఎలా జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏర్పాట్లు చేస్తే సరిపోతుందా?… వాటిని పర్చవేక్షంచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ఇతర అధికారులను నిలదీశారు. తోపులాట జరిగిన కౌంటర్ ను పరిశీలించిన చంద్రబాబు… 2000 మంది దాకా పట్టే ఈ కౌంటర్ లోకి ఒకేసారి 2,500 మందిని ఎలా పంపారంటూ మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నాక…దానిని నెరవేర్చాలి కదా అని చంద్రబాబు అనడంలో కలెక్టర్, ఎస్పీలు భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.
This post was last modified on January 9, 2025 3:51 pm
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…
హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం…
ఈ సంవత్సరం ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ క్లాష్ గా ట్రేడ్ అభివర్ణిస్తున్న ఆగస్ట్ 14 జరిగే కూలీ వర్సెస్ వార్…
ఏపీ ప్రజలకు కూటమి సర్కారు మంగళవారం శుభవార్తను చెప్పింది. రాష్ట్రంలో ఉంటూ ఇప్పటిదాకా రేషన్ కార్డులు లేని కుటుంబాలకు కొత్తగా…