విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ, మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదని లోకేశ్ కితాబిచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ అందించారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశాన్ని రోల్ మోడల్‌గా ప్రధాని మోడీ చేశారని లోకేశ్ కొనియాడారు. చంద్రబాబు విజన్ హైదరాబాద్‌లో కనిపిస్తోందని, మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్‌గా చేస్తామని అన్నారు.
విజన్-2047 కోసం..వికసిత భారత్ కోసం మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కష్టపడుతున్నారని, అందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. హర్ ఘర్ తిరంగా..ఎక్కడ చూసినా మోడీ నినాదాలు మిన్నంటాయని అన్నారు. పేదల చిరునవ్వు నమో..మహిళల ఆశాదీపం నమో అని లోకేశ్ కొనియాడారు.
This post was last modified on January 9, 2025 10:56 am
అభిమానులు ఆతృతగా ఎదురు చూసిన అన్ స్టాపబుల్ 4 నుంచి బాలకృష్ణ - రామ్ చరణ్ ఎపిసోడ్ నిన్న సాయంత్రం…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ఉదయం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా…
నిజమే. ఓ వైపు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత బుధవారం రాత్రి ఘోర విషాదం చోటుచేసుకుంది. అనూహ్యంగా…
జాతీయ స్థాయిలో పుష్ప 2 సత్తా చాటాక టాలీవుడ్ నుంచి మరో ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోంది. మూడేళ్ళకు…
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాదు. కానీ కొన్ని రోజుల కిందట తాను…
ఒక భారీ పాన్ ఇండియా హిట్ కొట్టాక.. ఆ హీరో నటించే సినిమా జాతీయ స్థాయిలో ఎలా ఆడుతుందనే ఆసక్తి…