దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న అంశాల్లో బిహార్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల మీద అన్ని పార్టీలు భారీగా ఆశలు పెట్టుకున్నాయి. ఆ రాష్ట్రంలో సొంతంగా పాగా వేయాలని బీజేపీ భావించినా..సాధ్యంకావటం లేదు. నితీశ్ పార్టీతో జత కట్టిన బీజేపీ.. తన సొంత బలాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని మహాకూటమి ఆరాటపడుతోంది. ఇలాంటివేళ.. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ – సీ ఓటర్ సర్వేను నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.
ఈ సర్వే ఫలితం ప్రకారం చూస్తే.. గెలుపు ఎన్డీయే కూటమిదేనని తేల్చారు. మరింత ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఈ సర్వే వివరాల్లో చాలానే ట్విస్టులు ఉన్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. తన భాగస్వామ్య పక్షమైన జేడీయూ కంటే కూడా బీజేపీ ఈసారి ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే.. ఎక్కువ సీట్లను సొంతం చేసుకున్న తర్వాత బీజేపీ తమ నేతను సీఎం చేయాలని భావిస్తుందే తప్పించి.. నితీశ్ ను ఒప్పుకుంటుందా? అన్నది మరో అంశం.
ఇక.. సర్వే వివరాల్లోకి వెళితే.. మొత్తం 243 స్థానాలున్నబిహార్ అసెంబ్లీలో 160 స్థానాల్ని ఎన్డీయే కూటమి సొంతమవుతాయని చెబుతున్నారు. 75 స్థానాలు మహాకూటమి ఖాతాలో పడతాయని అంచనా వేశారు. బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేసి 84 స్థానాల్లో విజయం సాధిస్తే.. బీజేపీ కంటే ఒక స్థానం ఎక్కువగా అంటే.. 122 స్థానాల్లో పోటీ చేసే జేడీయూ మాత్రం 70 సీట్లలోనే గెలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండుపార్టీలు కాక.. ఎన్డీయేలో ఉన్న మిగిలిన పార్టీలకు ఆరు సీట్లు వస్తాయని లెక్కలు కట్టారు.
మహాకూటమి విషయానికి వస్తే.. ఈసారి అధికారం మీద గంపెడాశ పెట్టుకున్న ఆర్జేడీకి 56 సీట్లకు మించి రావంటున్నారు. కాంగ్రెస్ ఎంత కష్టపడ్డా 15 దాటితే గొప్పేనని తేల్చారు. మరో పెద్ద పార్టీగా భావిస్తున్న ఎల్ జేపీకి ఐదు స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేశారు. అయితే.. జేడీయూ విజయ అవకాశాల్ని ఎల్ జేపీ దెబ్బ తీస్తుందని చెబుతున్నారు. దీంతో.. తన కారణంగా తాను లాభ పడకున్నా.. ప్రత్యర్థిని దెబ్బ తీసి.. మరో ప్రత్యర్థికి లాభం కలిగేలా చేస్తున్నట్లుగా చెప్పక తప్పదు. తాజాగా విడుదలైన సర్వే ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్నికలిగిస్తే.. దాని భాగస్వామి పక్షమైన జేడీయూలో ఆందోళన ఖాయమంటున్నారు.
This post was last modified on October 13, 2020 3:23 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…