Political News

ఏపీ పాలిటిక్స్ : 2024 పాఠం నేర్పిన తీరు.. !

2024.. మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం కొంద‌రిని మురిపిస్తే.. మ‌రింత మందికి గుణ‌పాఠం చెప్పింది. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక మంది నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను ఈ ఏడాది మార్చేసింది. కొంద‌రికి కోరి కోరి ప‌గ్గాలు ఎదురేగితే.. మ‌రికొంద‌రికి చివ‌రి నిమిషాల్లో ఆశ‌ల‌ను క‌బ‌ళించేసిన సంవ‌త్స‌రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అనేక మంది ఈ సంవ‌త్స‌రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే.. చివ‌రి నిముషంలో టికెట్లు ద‌క్క‌క ఈసురోమ‌న్న నాయ‌కులు కూడా ఉన్నారు. వీరికైనా.. వారికైనా 2024 కొత్త‌పాఠాల‌నే నేర్పించింద‌ని చెప్పాలి.

గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో గెలిచేందుకు ప్ర‌య‌త్నించిన పిఠాపురం టీడీపీ నాయ‌కులు వ‌ర్మ‌కు చివ‌రి నిమిషంలో ఆశాభంగ‌మైతే.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి చివరి నిముషంలో బ‌రిలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అదేవిధంగా చివ‌రి నిముషం వ‌రకు.. టికెట్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురైన పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌, బీజేపీ ఎమ్మెల్యే న‌ల్లమిల్లి రాధాకృష్ణ‌ల‌కు కూడా.. 2024 ఒక జ్ఞాప‌కంగానే కాకుండా.. పాఠంగా కూడా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం ఎలా ఉందో చూసేందుకు వ‌చ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌కు అనూహ్య‌ రీతిలో టికెట్ ద‌క్కింది.

ఆయ‌నకు కూడా 2024 ఒక మ‌ధుర జ్ఞాప‌క‌మే. ఇక‌, త‌న‌కు ఇక్క‌డ కాక‌పోతే.. మ‌రోచోట అయినా.. టికెట్ ఖాయ‌మ‌ని అనుకున్న దేవినేని ఉమా.. నిరాశ‌కు గురైంది కూడా ఈ ఏడాదే. అద‌విధంగా సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాలు చేసిన అనేక మంది నాయ‌కు లు ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. త‌మ గెలుపు రాసిపెట్టుకోవాల‌ని శ‌ప‌థాలు చేసిన రోజా, అంబ‌టి రాంబాబు వంటివారిని ఈ ఏడాది మ‌ట్టి క‌రిపించింది. త‌మ‌కు 30 ఏళ్ల‌పాటు తిరుగులేని విజ‌యం ద‌క్కుతుంద‌ని.. పాల‌న త‌మ‌దేన‌ని భావించిన జ‌గ‌న్ కూడా బొక్క‌బోర్లా ప‌డింది.. 2024లోనే.

వీరు మాత్ర‌మే కాదు.. అతిర‌థుల‌ను తీసుకుంటే.. మ‌హిళా సెంటిమెంటుతో విజ‌యం కోసం ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల నుంచి ‘ఈ ఒక్క సారే’ అంటూ.. సెంటిమెంటు పండించిన ఫైర్ బ్రాండ్‌ కొడాలి నాని వ‌ర‌కు అనేక మంది త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గా ల్లో ఓట‌మి చ‌విచూశారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌దు.. అనేందుకు 2024 ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. రాజ‌కీయం గా అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించింది. రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో నాయ‌కుల‌కు నేర్పించింది. ఎలా ఉండ‌కూడ‌దో కూడా అనేక పాఠాలు చెప్పింది. వారు-వీరు అనే తేడా లేకుండా.. 2024లో అంద‌రూ అనేక పాఠాలు నేర్చుకున్నార‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on December 31, 2024 1:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో శ్రీలీల ప్లేస్ ఏంటో చెప్పనక్కర్లేదు. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టినా పుష్ప…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త ప్రమాదం…జాగ్రత్త నిర్మాతలూ !

ఇండస్ట్రీని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న పైరసీ గురించి కొత్తగా చెప్పేందుకు ఏమి లేదు కానీ నిన్నా మొన్నటిదాకా ఇవి…

3 hours ago

ప్రేమ కోసం వెళ్లిన బాదల్ బాబుకు షాకిచ్చిన పాక్ పోరి!

'ప్రేమ కోసమే వలలో పడినె పాపం పసివాడు' అంటూ అప్పటి పాతాళ భైరవి సూపర్ హిట్ పాట.. ఇప్పటి తరానికి…

4 hours ago

విజయ్ ‘నో’ చరణ్ ‘ఎస్’ – గేమ్ ఛేంజర్ ట్విస్టు

ఇంకో వారం రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ కోసం తెలుగులోనే కాదు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ బజ్ కనిపిస్తోంది.…

4 hours ago

మొదటి పరీక్ష గెలిచిన శంకర్

గత ఏడాది భారతీయుడు 2 రిలీజైనప్పుడు దర్శకుడు శంకర్ కెరీర్ లోనే మొదటిసారి విపరీతమైన ట్రోలింగ్ కు గురయ్యారు. ఐ,…

5 hours ago

12 సంవత్సరాల తర్వాత విశాల్ సినిమాకు మోక్షం

ఏదో క్యాస్టింగ్ పెద్దగా లేని సినిమా ల్యాబ్ లో మగ్గుతుందంటే సహజం అనుకోవచ్చు. కానీ పేరున్న హీరో, ఇమేజ్ ఉన్న…

5 hours ago