సహజంగా అధికారంలో ఉన్నవారికి ఫోన్లు రాకతప్పదు.. వారు ఆన్సర్ చేయకా తప్పదు. కానీ, తనకు ప్రతి శుక్రవారం ఫోన్లు వస్తున్నాయని.. వీటిని భరించలేక పోతున్నానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లే ఫోన్లు.. అసలు ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నా.. ఆఫీసుకు చేసి మరీ విసిగిస్తున్నారు. ఈ విషయంలో నాకు చాలా ఇరిటేట్‌గా ఉంది” అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.
దీంతో శుక్రవారం ఫోన్ల వ్యవహారం తొలిసారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూటమి సర్కారు 14 లక్షల కోట్లని, తర్వాత.. 10 లక్షల కోట్లని, అసెంబ్లీలో 6 లక్షల కోట్లని ఇలా.. తలా ఒక లెక్క చెప్పారు. వైసీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో 3.5 లక్షల కోట్లని, తమ హయాంలో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని.. దీనిలో ఎక్కువ భాగం ప్రజలకు పంచామని చెప్పుకొచ్చింది.
మొత్తానికి జగన్ హయాంలో అప్పులు అయితే చేశారు. దీనికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా కేంద్రం ప్రోత్సహం కూడా ఉంది. గ్రాంట్లు ఇవ్వకుండా.. రాష్ట్రాలను అప్పుల మయం చేసిన ఘనత కేంద్రానిదేనని ఆర్థిక నిపుణులు కూడా పెదవి విరిచారు. ఇక, వైసీపీ హయాంలో చేసిన అప్పుల పై వడ్డీలు కట్టాలి. దీనికి ప్రతి నెలా చివరి శుక్రవారం గడువు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ భారం కట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది.
కానీ, కూటమి సర్కారు వద్ద రూకలు లేక.. నానా రచ్చ సాగుతోంది. దీంతో గడువు మీరిన తర్వాత.. తమ వడ్డీ చెల్లించాలంటూ.. బ్యాంకుల నుంచి ప్రతి శుక్రవారం ప్రభుత్వానికి ఫోన్లు వస్తున్నాయట. ఈ విషయం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అయితే..ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఓవర్ డ్రాఫ్టులు తెచ్చుకుని కాలం గడపాల్సి వస్తోందని.. పెన్నులు, పెన్సిళ్లకు కూడా.. ఆచి తూచి ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ చేసిన అప్పులపై వడ్డీలకు సొమ్ములు చెల్లించలేక పోతున్నామని సెలవిచ్చారు.
This post was last modified on December 30, 2024 3:57 pm
ఒకప్పుడు విదేశీ భాషలకు చెందిన సినిమాలను మన ఫిలిం మేకర్స్ యథేచ్ఛగా కాపీ కొట్టేసి సినిమాలు తీసేసేవారు. వాటి గురించి…
టాలీవుడ్ పవన్ స్టార్, ఏపీ డిప్యూట సీఎం పవన్ కల్యాణ్ గొప్ప మానవతావాది అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ కు…
భారత క్రికెట్ జట్టు మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదవ టెస్ట్ మ్యాచ్కు ముందు జట్టులో అనేక…
అభిమానులు రోజుకు కనీసం ఒక్కసారైనా తలుచుకోనిదే నిద్రపోని ఎస్ఎస్ఎంబి 29 ఇవాళ పూజ కార్యక్రమంతో మొదలైపోయింది. టాలీవుడ్ నే కాదు…
సంక్రాంతి సినిమాలకు హైప్ తీసుకొచ్చే విషయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. గత ఏడాది గుంటూరు…
వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండ చూసుకొని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల…