టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహకర్తలు పనిచేశారు. రాబిన్ శర్మ తన టీంను రంగంలోకి దింపి.. ఎప్పటికప్పుడు ఆలోచనలు పంచుకుని.. వ్యూహాలు వేసి.. పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి కూడా ఆయన పార్టీకి పనిచేసేందుకు రేపోమాపో రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఆయన మరోసారి పనిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే.. కూటమి సర్కారుకు అనుకున్న మైలేజీ వస్తున్నా.. ఇంకా రావాలన్న తపన ఉంది.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రాబిన్ శర్మను రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు రాబిన్ శర్మ పనిచేశారు. ఇది వర్కవుట్ అయింది. వచ్చే ఏడాది ఢిల్లీ, సహా యూపీ ఎన్నికలు ఉన్నాయి. అయినా.. ఆయన ఏపీపైనే కాన్‌సన్ట్రేట్ చేయనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నుంచి రాబిన్ శర్మ కు ఆహ్వానం వెళ్లడం.. ఆయన కూడా ఏపీకి వచ్చేందుకు రెడీ కావడం గమనార్హం.
ఇప్పుడు ఏం చేస్తారు?
ప్రభుత్వ పాలనపై రాబిన్ శర్మ తనదైన ముద్ర వేయనున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పరంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నారు. కానీ, చంద్రబాబు తరహాలో వారు ప్రచారం చేయలేక పోతున్నారు. ఈ క్రమంలో రాబిన్ శర్మ నేతృత్వంలో సరికొత్త ప్రచారం ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
దీని ప్రకారం.. సీఎం పేషీలో జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై 50 మంది యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరిని త్వరలోనే జిల్లాలకు పంపించి.. జిల్లాలకు ఇద్దరితో ప్రచారం చేయించనున్నారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా.. చూడడంతోపాటు, చంద్రబాబు పాలనను ప్రజలకు వివరించేలా వీరు చేయనున్నారు. ఇదేసమయంలో ప్రజల నాడిని కూడా పసిగట్టనున్నారు. ప్రజా వ్యతిరేకత రాకుండా.. కాపుకాచే బాధ్యతలను రాబిన్ శర్మకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
This post was last modified on December 29, 2024 4:22 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…