తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు కానీ.. ఆయనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినవారే. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఐతే ఆయన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులకు తెలుసు.
ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక పాడ్ కాస్ట్‌లో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎన్ఠీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్న ఆయన.. లక్ష్మీ పార్వతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారంటూ.. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీద ఎప్పుడూ ప్రత్యర్థులు విమర్శలు చేసి ఇబ్బంది పెట్టే వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘పెద్దాయన చనిపోయినపుడు వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చింది నేనే. మీరు వీడియో చూస్తే ఆయన బాడీ మీద పడుకుని ఏడ్చాను. ఎందుకు అనేది ఇవాళ చెబుతున్నాను ఫస్ట్ టైం. నా దృష్టిలో రామారావు గారు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు. కానీ ఒక స్టేజ్‌లో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆమె వచ్చాకే అంతా మారిపోయింది.
ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్ల. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని అందరూ బయటపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. ఆవిడ్ని నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆవిడ మీద మర్యాద లేదు నాకు.
ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరి ఆయన్ని మాకు లేకుండా చేసింది అన్నది నా అభిప్రాయం. అప్పటి ఎన్నికల కవరేజీ చూడండి. ఆవిడ మీద ఒంటి కాలి మీద లేచి ఆమెను తొక్కేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ముందుంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.
This post was last modified on December 29, 2024 3:00 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…