Political News

కేటీఆర్ కు ఈడీ పిలుపు.. నెక్ట్స్ అరెస్టేనా?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్ప‌టికే ద‌ర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచార‌ణ‌కు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివ‌రాల‌ను ప‌రిశీలించింది. ఈ క్ర‌మంలో తాజాగా కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. జ‌న‌వ‌రి 7న విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో కేటీఆర్‌కు స్ప‌ష్టం చేసింది. అయితే.. విచార‌ణ సంద‌ర్భంగా కేటీఆర్‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

ఇదిలావుంటే.. ఈ కేసులోనే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైద‌రాబాద్ మెట్రో డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు శ‌నివారం నోటీసులు జారీ చేశారు. వీరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకా వాలని ఈడి నోటీసులలో పేర్కొంది. దీంతో వీరు కూడా.. వాంగ్మూలం ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే.. అరెస్టు అంశాల‌పై మాత్రం వార్త‌లు వ‌స్తున్నాయి.

ఏం జ‌రిగింది.?

కేసీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ-రేస్ నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ మెట్రో కార్పొరేష‌న్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయ‌ల‌ను దుర్వినియోగం చేశార‌న్న‌ది ఆరోప‌ణ‌. ఈ నిధుల‌ను విడుద‌ల చేయాల‌ని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయ‌డంతో అధికారులు నిధులు మంజూరు చేశార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. దీనిపై స‌ర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసులు న‌మోదు చేసింది.

మ‌రోవైపుఈ వ్య‌వ‌హారం ఇటీవ‌ల అసెంబ్లీని సైతం కుదిపేసింది. అస‌లు ఏమీ జ‌ర‌గ‌ని దానికి కేసులు ఎలా న‌మోదు చేస్తార‌ని కేటీఆర్ అండ్ కో ప్ర‌శ్నించారు. అంతేకాదు.. దీనిపై చ‌ర్చ‌కు సైతం తాము రెడీ అని.. తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో ఏసీబీ అధికారులు ఈ కేసులో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని పేర్కొంటూ ఈడీకి రిఫ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం ఈడీ నుంచి కేటీఆర్‌కు నోటీసులు వ‌చ్చాయి. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on December 28, 2024 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

36 minutes ago

గేమ్ ఛేంజర్ పైరసీ… బన్నీ వాస్ కామెంట్స్

గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…

1 hour ago

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

6 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

7 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

7 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

9 hours ago