ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న సంధించారు. వైఎస్ వారసురాలిని నేనేనని.. బీజేపీతో చేతులు కలిపిన జగన్ కానేకాదని ప్రచారం చేశారు. అంతేకాదు.. ఎన్నికల తర్వాత తమ పై జగన్ కేసు వేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. వైఎస్ వారసుడు.. అయి ఉంటే సొంత చెల్లి, తల్లిపైనే కోర్టుకు ఎక్కుతాడా? అంటూ నిప్పులు చెరిగారు. మొత్తంగా వైఎస్ వారసత్వం వ్యవహారం.. కొన్నాళ్ల కిందట వరకు పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది.
దీనికితోడు వివేకానందరెడ్డి హత్య.. ఈ ఏడాది ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారం.. వంటి విషయాల్లో వైఎస్ కుటుంబం ఎటు ఉంటుందన్న విషయంపైనా సందేహాలు నెలకొన్నాయి. వివేకా కుమార్తె సునీత వైపు కొందరు ఉంటారని భావించారు. కానీ, అందరూ మౌనంగానే ఉండిపోయారు. ఎవరూ ఎటూ నిలబడ కుండా.. అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. ఈ క్రమంలో ‘వైఎస్’ కుటుంబం ఎవరి పక్షాన నిలబడుతుంద నే చర్చ జోరుగానే సాగింది. తాజాగా ఈ వ్యవహారంలోనే.. జగన్ ఓ అడుగు ముందుకు వేశారు.
క్రిస్మస్ ను పురస్కరించుకుని జగన్ ‘వారసత్వ’ వ్యవహారంలో వ్యూహాత్మక స్టెప్ వేశారు. క్రిస్మస్ సంద ర్భంగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో చోటు చేసుకున్న పరిణామాలు జగన్ వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు మూడు దశాబ్దాలుగా కూడా.. దూరంగా ఉన్న బంధువులను పులివెందులకు ఆహ్వానించారు. వారితో విందు భోజనాలు కూడా చేశారు. అంతేకాదు .. గ్రూప్ ఫొటోలు దిగారు. సోషల్ మీడియాలోనూ వీటిని పోస్టు చేశారు.
ఈ వేడుకల్లో విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఆమెను కూడా తన పక్కనే కూర్చోబెట్టుకున్న జగన్.. తమ కుటుంబంలో ముఖ్యంగా తల్లితో ఎలాంటి పొరపొచ్చాలు లేవన్న సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. వైఎస్ కుటుంబ సభ్యులు యావత్తు అందరూ తన వెంటే నిలిచారని కూడా ఆయన చెప్పుకొచ్చినట్టు అయింది. అంతేకాదు.. ఐక్యంగా ఉన్న నేపథ్యంలో తమ సమస్యలు తాము పరిష్కరించుకుంటామన్న సంకేతాలు కూడా ఇచ్చినట్టు అయింది. మరి ఈ వారసత్వం.. ఐక్యాత వ్యూహాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.
This post was last modified on December 27, 2024 3:13 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…