తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్‌బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి. అలానే.. పుష్ప-2 వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరుకున పడేశారు. జైభీమ్-పుష్ప-2కు.. జాతీయ అవార్డుకు లింకు పెట్టి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇదేకాదు.. అనేక విషయాల్లో సితక్క బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.
ఈ పరిణామాలు చూసిన తర్వాత.. సీతక్క లాంటి మంత్రి మనకూ కావాలా? అనే చర్చ ఏపీలో ఆసక్తిగా మారింది. నిజానికి ఏపీలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. కానీ, ఎవరూ కూడా ఇంత ఫైర్ అయితే కాదు. వంగలపూడి అనిత.. సబ్జెక్టు పరంగా కామెంట్లు చేయగలరు. ఇక, మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా.. తమ తమ స్థాయికే పరిమితం కానీ.. పెద్దగా ఫైర్ అయితే కాదు. దీంతో సీతక్క తరహాలో ఎవరైనా ఒక మహిళా మంత్రి ఉంటే.. సూపర్ అనే టాక్.. తమ్ముళ్ల మధ్య వినిపిస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ జరిగితే.. సీతక్క లాంటి వారు కావాలని చంద్రబాబు సైతం భావిస్తే.. ఇద్దరు కీలక నాయకురాళ్లు రెడీగా ఉన్నారు. ఒకరు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి. రెండు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి. ఈ ఇద్దరు కూడా.. ఫైర్ బ్రాండ్సే. మాధవీ రెడ్డి అయితే.. నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే అయిన మర్నాడే.. నియోజకవర్గంలో వైసీపీ నేతలకు దడ పుట్టించారన్న టాక్ ఉంది.
ఇక, కార్పొరేషన్‌లోనూ.. తనదైన శైలిలో మాధవి రెడ్డి.. సత్తా చాటుతున్నారు. నియోజకవర్గంలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఇక, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా ఫైరే! గతంలోనూ ఆమె మంత్రిగా పనిచేశారు. మాటకు మాట! అనే తరహాలో ఈ ఇద్దరు కూడా.. రాజకీయాల్లో సంచలనాలకు పెట్టింది పేరు. సో.. మనకు కూడా సీతక్కలు కావాలని అనుకుంటే.. చంద్రబాబు ఆప్షన్ వీరివైపే ఉంటుందన్న చర్చ సాగుతోంది. కానీ, చంద్రబాబు అలా చేయడం సాధ్యం కాకపోవచ్చు.
This post was last modified on December 27, 2024 9:20 am
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…
ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ లో నటించాక ఏ హీరోయిన్ కైనా ఆఫర్ల వర్షం కురుస్తుంది. కానీ కెజిఎఫ్ రెండు భాగాల్లో…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి రెండు పెద్ద సినిమాలు సెట్స్ మీదుంచి వాటిని బ్యాలన్స్ చేయడం ఎంతటి అగ్ర నిర్మాతలకైనా సరే…
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గాలి భానుప్రకాష్ నాయుడు.. దూకుడు ప్రదర్శిస్తున్నారు. యువ ఎమ్మెల్యేగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ ఎన్నికల సమయంలోనూ.. తర్వాత కూడా.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఓ ప్రశ్న…
ఈ టాపిక్ అల్లు అర్జున్ కోర్టు కేసు, బెయిలు గురించి కాదులెండి. ఆ వ్యవహారం న్యాయస్థానంలో జరుగుతోంది కాబట్టి దాని…