తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి శేష్, నితిన్ తదితరులతో పాటు సురేష్ బాబు, కెఎల్ నారాయణ ఇతర నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వం వైపు నుంచి టాలీవుడ్ కు వచ్చిన ప్రతిపాదనల్లో కులగణన సర్వేల్లో నటీనటులు పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సినిమా ప్రారంభానికి ముందు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం, ప్రతి టికెట్టు మీద సెస్సు వసూలు చేయడం, సామజిక స్పృహ కలిగించే విధంగా చొరవ తీసుకోవడం ప్రధానమైనవిగా చెబుతున్నారు. అంతే కాకుండా ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదనే సూచన చేసినట్టు తెలిసింది. గద్దర్ అవార్డుల గురించి డిస్కషన్ జరిగిందని సమాచారం.
వీటిలో అధిక శాతం సాధ్యమయ్యేవే కానీ కులగణన లాంటివి సినిమాలకు సంబంధం లేని విషయాలు కావడంతో దీనికి ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి టాలీవుడ్ కు సరైన సహకారాలు అందుతూనే ఉన్నాయని, కానీ కొన్ని ఘటనల వల్ల ఇరువురికి చెడ్డ పేరు రావడం ఇకపై మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలనే దిశగా పలు సూచనలు రెండు వైపులా వచ్చినట్టు వినికిడి. కంక్లూజన్లు, సవరణలు, చర్యలు తదితర వివరాలు ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు వెల్లడించే అవకాశముంది. సంక్రాంతి దగ్గరగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on December 26, 2024 11:45 am
జవాన్ దర్శకుడు అట్లీ బ్రాండ్ ని నిర్మాతగా వాడుకున్నారు. వరుణ్ ధావన్ అక్కడా ఇక్కడా అని లేకుండా అన్ని చోట్లా…
కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీల మధ్య కొన్ని…
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్…
సీఎం చంద్రబాబు .. రాజధాని అమరావతికి బ్రాండ్ అని అందరూ అనుకుంటారు. కానీ, ఆయన అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగలరని…
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. గతంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, గులేబకావళి కథ, శ్రీ కృష్ణ పాండవీయం…
కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని…