సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.
కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించానని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, రేవతి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని దిల్ రాజు భరోసానిచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. కావాలని ఇలా ఎవరూ చేయరని, వినోదం కోసమే రేవతి కుటుంబం థియేటర్‌కు వెళ్లిందని, అనుకోకుండా ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.
రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ తో భేటీ అవుతామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
This post was last modified on December 24, 2024 5:48 pm
ఇంకో వారం రోజుల్లో నూతన ఏడాది రాబోతోంది. మాములుగా అయితే టాలీవుడ్ నుంచి ఒకప్పుడు జనవరి 1నే ఏదో ఒక…
తండేల్ విడుదలకు ఇంకో నలభై మూడు రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే కొంత ఆలస్యం తర్వాత పలు డేట్లు మార్చుకుంటూ…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై కేసు నమోదైన…
రాజకీయ నాయకులకు సన్మానాలు, సత్కారాలు కామన్. అభిమానులు..కార్యకర్తలు తమ నేతను కలిసినపుడు మర్యాదపూర్వకంగా శాలువాలు కప్పుతుంటారు. తమకు గౌరవార్థం ఇచ్చారు…
వరస బ్లాక్ బస్టర్లతో దూసుకుపోతున్న బాలకృష్ణ కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా…
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ…