తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్‌రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదు చేసిన కేసు, భూపాలపల్లి జిల్లా సెషన్సు కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించినట్టయింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఏం జరిగింది?
కేసీఆర్ హయాంలో మేడిగడ్డ బ్యారేజీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే.. బ్యారేజ్‌లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అనంతరం.. ఈ బ్యారేజీని కేంద్ర జలవనరుల సంఘం పరిశీలించింది. బ్యారేజీలోని ఆరో బ్లాకు నుంచి ఎనిమిదో బ్లాకు దాకా.. 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ దాకా.. పరిశీలించారు.
అనంతరం.. స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ పిల్లర్లు కుంగిపోవడానికి.. బ్యారేజీ దెబ్బ తినడానికి కూడా.. అప్పటి సీఎం, మంత్రులే కారణమని పోలీసులు విడిగా మరోకేసు పెట్టారు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు వారిని విచారణకు కూడా పిలిచింది. అనంతరం.. కేసీఆర్, హరీష్‌రావులు ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా పలు విచారణల అనంతరం.. వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది.
This post was last modified on December 24, 2024 4:25 pm
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…