ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసే ఈ నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అటెండెన్సును.. ఆయన మంత్రులకు కూడా విస్తరించారు. జనవరి 1వ తేదీ నుంచి నూతనంగా అందు బాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక యాప్‌లో అటెండెన్స్ వేయనున్నారు.
ప్రత్యేక యాప్‌ను ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించారు. దీనిని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. మంత్రులు ఎక్కడ ఉన్నా… వారు తమ ఫోన్లలో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అంటే.. వారు నిరంతరం.. పనిలో ఉంటున్నారా? లేక సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారా? అనే విషయంపై చంద్రబాబు పక్కాగా పరిశీలించనున్నారు. ఈ క్రమంలో మంత్రులు అందరూ.. ఉదయం 11 గంటలలో పల.. తాము ఎక్కడ విడిది చేసినా.. ఏ పనిలో ఉన్నా.. యాప్ ద్వారా అటెండెన్సు వేయాల్సి ఉంటుంది.
ఇది సీఎం డ్యాష్ బోర్డుకు చేరుతుంది. మంత్రుల పనితీరును అంచనా వేయడంలో దీనికి కూడా ప్రధాన మార్కులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2015-19 మధ్య కూడా.. కొన్నాళ్లు ఈ ప్రయత్నం చేసినా.. అది విఫలమైంది. కానీ, ఇప్పుడు పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాను కూడా ఈ అటెండెన్సును వేయనున్నారు. అదేవిధంగా.. మంత్రుల షెడ్యూల్‌ను కూడా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్ విడుదల చేసే విషయంలో సీఎం చంద్రబాబు ముందున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితులను బట్టి.. షెడ్యూల్ ఉంటోంది. ఇక, మంత్రుల విషయంలో వారు ఎలాంటి పనులు చేస్తున్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు అటెండెన్సు.. ఇటు షెడ్యూల్ రెండూ కూడా.. జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. అయితే.. సెలవు దినాలు, పండుగలు వంటి రోజుల్లో మినహాయింపు ఉంటుంది. కాగా.. ఈ విధానం అమలు చేస్తున్న రెండో రాష్ట్రం ఏపీ కావడం విశేషం. తొలుత ఈ విధానాన్ని ఢిల్లీలో కేజ్రీవాల్ అమలు చేశారు.
This post was last modified on December 24, 2024 12:24 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…