న్యాయ, రాజకీయ వ్యవస్ధల్లోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీష్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలు చేశారు బాగానే ఉంది. మరి తన ఆరోపణలపై జగన్ ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారు ? జగన్ చేసిన ఆరోపణలపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే ఏ విధంగా స్పందిస్తారు ? అన్నది ఇక్కడ కీలకమైంది.
ఓ టీవీ చర్చల్లో పాల్గొన్న కొందరు లాయర్ల అభిప్రాయం ప్రకారం రాష్ట్రానికి సంబందించిన కేసులను ఇక నుండి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దేనికైనా బదిలి చేయించాల్సుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కు సంబంధించిన అదాయానికి మించిన అక్రమాస్తుల కేసులను కర్నాటక హైకోర్టులో విచారించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తమిళనాడు హైకోర్టు విచారణపై తనకు నమ్మకం లేదని అప్పట్లో జయలలిత చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సుప్రింకోర్టు పై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒక రాష్ట్రంలోని కేసులను ఇతర రాష్ట్రాల్లో విచారించిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఉద్దేశ్యపూర్వకంగా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. అంటే హైకోర్టు విచారణపై తన నమ్మకం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. కాబట్టి ఇపుడు విచారణలు జరుగుతున్న కేసులను ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులకు బదిలీ చేయటంతో పాటు ఇక నుండి ఏ కేసును కూడా హై కోర్టులో విచారణ జరగకపోవటమే మంచిదని అభిప్రాయపడ్డారు.
నిజానికి ప్రభుత్వ, న్యాయవ్యవస్ధల మధ్య తలెత్తకూడని వివాదం తల్లెత్తింది కాబట్టి సుప్రింకోర్టు తొందరగా ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందే అని చాలామంది లాయర్లు అభిప్రాయపడ్డారు. ఇపుడు గనుక వివాద పరిష్కారంలో ఆలస్యమైనా లేదా పట్టించుకోకపోయినా ఇవే సమస్యలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా విధానపరమైన నిర్ణయాలపైన, ప్రభుత్వాలు జరిపించే విచారణల విషయాల్లో హైకోర్టులు తొందరగా జోక్యం చేసుకోవని స్పష్టంగా చెప్పారు. కానీ ఏపిలో మాత్రం ఇందుకు భన్నంగా జరుగుతోంది కాబట్టే వివాదం మొదలైందని అభిప్రాయపడ్డారు.
This post was last modified on October 12, 2020 11:23 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…